ఇరాన్‌లో భూకంపం, పలువురు మృతి..!

By న్యూస్‌మీటర్ తెలుగు  Published on  8 Nov 2019 9:08 AM GMT
ఇరాన్‌లో భూకంపం, పలువురు మృతి..!

టెహ్రాన్‌ : ఇరాన్‌లో భూకంపం సంభవించింది. భూకంపంలో ఎంత మంది చనిపోయారో తెలియడం లేదు. ప్రస్తుత సమాచారం ప్రకారం భూ కంప మృతులు భారీగా ఉండే అవకాశముంది. పలు ఇళ్లు ధ్వంసమయ్యాయి. భూకంప తీవ్రత రిక్టర్ స్కేల్‌పై 5.9 గా నమోదైంది.

అజర్‌బైజాన్‌ నుంచి తాబ్రిజ్‌వరకు సుమారు120 కిలోమీటర్ల మేర భూమి కంపించినట్టుగా అధికారులు చెప్పారు. భూమి నుంచి 5 కిలోమీటర్ల దిగువన భూకంప కేంద్రాన్ని గుర్తించినట్టు భూకంప అధికారులు తెలిపారు.

అయితే..ఈ భూకంపాన్ని అమెరికా జియోలాజికల్ సర్వే ముందుగానే అంచనా వేసింది.భూకంపం రాబోతుందని, ప్రాణనష్టం సంభవించే అవకాశముందని హెచ్చరించింది. గత కొన్ని దశాబ్దాలుగా ఇరాన్‌ ఎన్నో విపత్తులను ఎదుర్కుంటోంది.

Next Story