12 నిమిషాలకో బాధితుడు మృతి

By రాణి  Published on  24 March 2020 4:44 PM GMT
12 నిమిషాలకో బాధితుడు మృతి

గత కొద్ది రోజులుగా కరోనా వైరస్ ప్రభావం ఎక్కువగా ఉందనే కన్నా..గడిచిన వారంరోజులుగా కరోనా వైరస్ ప్రపంచ వ్యాప్తంగా తన అసలు రూపాన్ని చూపిస్తుందనడం కరెక్ట్. నిజం..ఇతర దేశాలతో పోలిస్తే ఇండియాలో కరోనా ప్రభావం తక్కువే. అలాగని అలసత్వం వహిస్తే మాత్రం..మనం కూడా కరోనాకు బలవ్వాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. కరోనాకు మూలమైన చైనాలో కరోనా వైరస్ తగ్గుముఖం పట్టింది. వేలమంది బాధితులు వైరస్ నుంచి కోలుకుంటున్నారు. కానీ..చైనా వెలుపల మాత్రం కరోనా వైరస్ ప్రతాపాన్ని చూపిస్తోంది. ముఖ్యంగా ఇటలీ అత్యధిక కరోనా పీడిత దేశంగా ఉంది. ఇప్పటి వరకూ 6 వేలకు పైగా కరోనా మరణాలు నమోదయ్యాయి. గుట్టగుట్టలుగా శవాలు పేరుకుపోతున్నాయి. చనిపోయిన వ్యక్తి ఫొటో కుటుంబానికి చూపించి దహన సంస్కారాలు చేసేస్తారు. ఇటలీ తర్వాత ఆ స్థాయిలో మరణాలు నమోదవుతున్నది ఇరాన్ లోనే.

Also Read : యుగయుగాల ఉగాది

అవును..ఇరాన్ లో ప్రతి 12 నిమిషాలకొక కరోనా బాధితుడు చనిపోతున్నాడని ఆదేశ ఆరోగ్య మంత్రిత్వ శాఖ చెప్పినట్లు ఐఆర్ఎన్ ఎస్ న్యూస్ ఏజెన్సీ నివేదించింది. కరోనా ప్రభావం ఎక్కువగా ఉన్న టెహ్రాన్, ఇరాన్ ప్రావిన్స్ ల లో కరోనా కేసులు పెరుగుతున్నట్లు ఆరోగ్య మంత్రిత్వ శాఖ పబ్లిక్ రిలేషన్స్ అండ్ ఇన్ఫర్మేషన్ సెంటర్ హెడ్ కియానుష్ జహాన్ పూర్ తెలిపారు. టెహ్రాన్ లో కరోనా ప్రభావం 13 శాతం విస్తరిస్తోంది. దీంతో ఇస్ఫాహాన్, ఖోరాసన్ రజావి, తూర్పు అజర్‌బైజాన్ ప్రావిన్సులలో ఇటీవల పెరుగుతున్న ఇన్‌ఫెక్షన్‌ వల్ల ఎక్కువ మరణాలు సంభవించినట్లు ఆయన పేర్కొన్నారు.

ఇప్పటి వరకూ ఇరాన్ లో 1934 మంది మృతి చెందగా, 24, 811 కరోనా కేసులు నమోదయ్యాయి.

Also Read : ఒళ్లంతా పచ్చడి కావాలంటే బయటకు రండి

ఇండియాకన్నా ముందే, ఇటలీ, ఇరాన్, ఇరాక్ దేశాల్లో దాదాపు లాక్ డౌన్ పరిస్థితి నెలకొన్నప్పటికీ..అక్కడ వైరస్ అంతకంతకూ విజృంభిస్తుండటంతో..ప్రజలను కాపాడలేక ప్రభుత్వాలు చూస్తూ ఉండటం తప్ప ఏమీ చేయలేకపోతున్నాయి.

Next Story