ఇరాన్ ఆర్మీ కమాండర్ ను అంతం చేసిన అమెరికా

By రాణి  Published on  3 Jan 2020 1:15 PM GMT
ఇరాన్ ఆర్మీ కమాండర్ ను అంతం చేసిన అమెరికా

అతను ఇరాన్ లో రెండో అత్యంత శక్తిమంతమైన నేత. ఆయన ఇరాన్ రివల్యూషనరీ గార్డ్స్ లోని ఖుద్స్ ఫోర్స్ కు జనరల్ గా వ్యవహరిస్తున్నారు. అతనే ఖాసీం సులేమాని. శుక్రవారం తెల్లవారుజామున బాగ్దాద్ విమానాశ్రయంపై జరిగిన దాడిలో ఆయన మరణించారు. ప్రపంచ వ్యాప్తంగా ఇరాన్ రివల్యూషనరీ గార్డ్స్ (ఐఆర్ జీసీ) గురించి చెప్పే కథనాల్లో ఆయన ఫొటోనే వాడుతారు.

ఇరాన్ చుట్టుపక్కల దేశాల్లో షియా ముస్లింలకు అనుకూలంగా కార్యకలాపాలను సాగిస్తుంటుంది సులేమానీ ఖుద్స్ ఫోర్స్.

Iran Amry Commander Qasim Sulemani2019, డిసెంబర్ 28న ఇరాక్ లో ఒక అమెరికా కాంట్రాక్టర్ హత్యకు గురవ్వడంతో అమెరికా బలగాలు కొన్ని లక్ష్యాలపై దాడులు చేశాయి. ఆ మర్నాడు నుంచి బాగ్దాద్ లోని అమెరికా రాయబార కార్యాలయంపై షియా బృందాలు దాడులకు తెగబడటంతో వీటిని ఖుద్స్ ఫోర్స్ వెనకుండి నడిపిస్తోందని అర్థం చేసుకుంది అమెరికా. దీంతో ఇంక ఏ మాత్రం ఆలస్యం చేసినా ఇరాక్ లో అమెరికా వ్యతిరేక వాతావరణాన్ని ఎదుర్కోవాల్సి ఉంటుందని భావించిన అమెరికా బలగాలు సులేమాని ని టార్గెట్ చేశాయి. అంతే లెబనాన్ లేదా సిరియా నుంచి వస్తున్న ఒక విమానంలో సులేమాని ఉన్నట్లు సమాచారం అందడంతో..అప్పటికే కసి తీర్చుకోవాలని వెంపర్లాడుతున్న అమెరికా దళాలు ఆపరేషన్ సులేమాని కి తెరలేపారు. మొబలైజేషన్ ఫోర్స్ అంటే షియా మిలిటెంట్ గ్రూప్ లు ఏర్పాటు చేసిన సంస్థ నేత ముహంది తన కాన్వాయ్ తో అప్పటికే విమానాశ్రయం చేరుకున్నారు. సులేమాని విమానం దిగి ముహందిని కలవగానే అమెరికా దళాలు రాకెట్లతో దాడి చేసినట్లుగా తెలుస్తోంది. ఈ దాడిలో ఎయిర్ పోర్ట్ ప్రొటోకాల్ అధికారి మహమూద్ రెదా కూడా మృతిచెందినట్లు సమాచారం. అయితే..ఈ దాడిపై ఇంకా ఖచ్చితమైన సమాచారం రావాల్సి ఉంది. ఖుద్స్ ఫోర్స్ జనరల్ సులేమాని చేతికి ఎర్రని రాయితో చేసిన ఉంగరం ఎప్పుడూ ఉంటుంది.. దాని ఆధారంగానే అతను మృతి చెందినట్లుగా అధికారులు గుర్తించారని తెలుస్తోంది.

ఎవరు ఈ ఖాసీం సులేమాని ?

ఖాసీం సులేమాని 1957లో ఒక పేద కుటుంబంలో జన్మించారు. 13 ఏళ్ల వయసులో ఒక నిర్మాణ రంగ సంస్థలో కార్మికుడిగా, ఆ తర్వాత కెర్మాన్ వాటర్ ఆర్గనైజేషన్ లో పనిచేస్తూ..జిమ్ కు వెళ్లేవాడట. తీరిక సమయాల్లో ఖొమైనీలు నిర్వహించే కార్యక్రమాల్లో పాల్గొనేవాడు. అలాగే కరాటేలో కూడా బ్లాక్ బెల్ట్ అందుకున్నాడట ఈ ఖాసీం సులేమాని. 1979లో ఇస్లామిక్ రివల్యూషన్ అనంతరం ఆయన ఐఆర్జీసీలో చేరిన కొద్ది కాలానీ 8 ఏళ్ల పాటు ఇరాన్ - ఇరాక్ మధ్య జరిగిన యుద్ధంలో ఇరాక్ రసాయన ఆయుధ దాడి చేసింది. ఈ దాడిలో సులేమాని బృందం చిక్కుకొంది. ఆ తర్వాత ఇరాన్ అధ్యక్షుడు రఫ్సంజానీతో విభేదాల కారణంగా ఆయన 1989 - 97 వరకూ అజ్ఞాతవాసంలో ఉండిపోయాడు. రఫ్సంజానీ పదవి నుంచి వెళ్లిపోయాక ఖాసీం ఖుద్స్ ఫోర్స్ కు కమాండర్ స్థాయిలో ఎదిగాడు.

2007లో అప్పటి అమెరికా జనరల్ డేవిడ్ పీట్రస్ కు సులేమాని ఇరాన్ శక్తిని వెల్లడించే ప్రయత్నం చేశాడు. ఈ మేరకు ఒక సందేశాన్ని పంపాడు. '' జనరల్ పీట్రస్ నీకు తెలుసు నేను ఖాసీం సులేమాని అని. ఇరాక్ లెబనాన్, గాజా, అఫ్గానిస్థాన్ లో ఇరాన్ పాలసీని నియంత్రిస్తున్నాను. ప్రస్తుతం ఇరాక్ లోని ఇరాన్ రాయబారి ఖుద్స్ ఫోర్స్ సభ్యుడే. అతని తర్వాత వచ్చేది ఖుద్స్ ఫోర్స్ సభ్యుడే '' అని పేర్కొన్నాడు. సులేమాని సందేశంతో పీట్రస్ అమెరికా డిఫెన్స్ సెక్రటరీగా పనిచేశారు. ఈ విషయాన్ని అతను ఒక సందర్భంలో వెల్లడించడంతో..2007లో సులేమానిపై ఐరాస ఆంక్షలు విధించింది. 2011లో సులేమాని సౌదీ దౌత్య సిబ్బందిని హత్యచేసేందుకు మెక్సికన్ డ్రగ్స్ స్మగ్లర్ సహాయం కోరినట్లు ఆరోపణలు సైతం వెల్లువెత్తాయి.

ఇటీవల ట్రంప్ కు కూడా సులేమాని హెచ్చరికలు జారీ చేశారు. ఇరాన్ - అమెరికా మధ్య ఉద్రిక్తతలు పతాక స్థాయిలో ఉన్న సమంలో సులేమాని నేరుగా.. '' మిస్టర్ ట్రంప్..ఓ జూదగాడా..మేము నీకు చాలా దగ్గరగా ఉన్నాం. ఆ ప్రదేశం నీ ఊహకు కూడా అందదు. నువ్వు యుద్ధం మొదలుపెడితే మేము యుద్ధాన్ని ముగిస్తాం '' అంటూ హెచ్చరించాడు.

Next Story