9ఏళ్ల ప్రేమ వంచన..ఐపీఎస్ పై దళిత యువతి ఫిర్యాదు..!

By సత్య ప్రియ  Published on  29 Oct 2019 9:25 AM GMT
9ఏళ్ల ప్రేమ వంచన..ఐపీఎస్ పై దళిత యువతి ఫిర్యాదు..!

హైదరాబాద్: చకొండ పోలీసు స్టేషన్లో ఒక ఐపీఎస్ ట్రైనీ పై ఎఫ్ ఐ ఆర్ నమోదు చేశారు. తన భార్యను మోసం చేసినందుకు గానూ, కొక్కంటి వెంకట మహేశ్వర రెడ్డి, ట్రైనీ ఐపిఎస్ పై హైదరాబాద్ లో కేసు నమొదు అయ్యింది.

Img 20191029 Wa0001

28 ఏళ్ల బిరుదుల భావన, ప్రస్తుతం ప్రభుత్వ ఉద్యోగినిగా పని చేస్తోంది. వెంకట మహేశ్వర్ ని 2009 లో ఉస్మానియా లో ఇంజినీరింగ్ చేస్తుండగా కలిసింది. "9 ఏళ్లు ఒకరినొకరు అర్ధం చేసుకున్న తరువాత ఫిబ్రవరీ 9, 2018 న మేము పెళ్లి చేసుకున్నట్లు చెప్పింది. మొదటి సారి కలిసినప్పుడే నాతో స్నెహం చేశాడు, తరువాత నన్ను ప్రేమించానని చెప్పి పెళ్లి చేసుకోమని అడిగాడు" అంటోంది భావన.

Img 20191029 Wa0000

"నేను లేకుండా బతకలేనని చెప్పాడు, కానీ ఇప్పుడు భారీ కట్నం కోసం ఇంకో అమ్మాయితో పెళ్లి చేసుకోవడానికి రెడి అవుతున్నాడు. పెళ్లి కోసం మంచి ఉద్యోగం అవసరం అని నమ్మించి, యూ పి ఎస్ సి పరీక్ష రాసేముందు అనేవాడు. యూ పి ఎస్ సి పరీక్ష పాస్ అయ్యాక మారిపోయాడు"

కడప కి చెందిన వెంకట మహేశ్వర రెడ్డి 2019లో యూ పి ఎస్ సి పరీక్ష లలో ఆల్ ఇండియా రాంక్ 126 సాధించాడు. ఐఐటి ముంబై లో డిగ్రీ కూడా ఉంది. అతని తల్లిదండ్రులు వ్యవసాయం చేస్తారు.

Img 20191029 Wa0003

జూలై లో ఐపిఎస్ ప్రొబేషనర్ ను అవ్వబోతున్నాననీ, తనకు ఎన్నో పెళ్లి సంబంధాలు వస్తున్నాయనీ, కావున తనకు విడాకులు ఇవ్వమని ఒత్తిడి తెస్తున్నాడనీ భావన చెప్తోంది. పోలీసుల నుంచి భద్రత కోరుతూ "తనకు ఎందరో పోలీసులు తెలుసుననీ, ఎవరూ నాకు సహాయం చేయరనీ, విడాకులకు ఒప్పుకోకపోతే ఇంటికి గుండాలని పంపుతాననీ మహేశ్వర రెడ్డి బెదిరించాడని భావన అంటోంది.



రాచకొండ పరిధిలో జవాహర్ నగర్ పోలీసు స్టేషన్లో 498-A , 323, 506IPC , 3(1), 3(r), 3(s), 3(2), (V)(a)SC ST POA ACT సెక్షన్ల కింద అక్టోబర్ 27, 2019 న కేసు నమోదు చేసారు.



ఈ కేసు గురించి రాచకొండ పోలిస్ కమీషనర్ మహేశ్ భాగవత్ మాట్లాడుతూ "జవాహార్ పోలీస్ స్టేషన్ లో ఎఫ్ ఐఆర్ నమోదు అయ్యింది. కుషాయ్ గూడా ఏసిపి ఈ కేసును పరిశీలిస్తున్నారు. ఎఫ్ ఐ ఆర్ కంటే ముందుగా, హై కోర్ట్ లో 3 సార్లు కౌన్సిలింగ్ ఇప్పించాల్సి ఉంది. ఇరువురినీ పిలిచి ఒప్పందం కుదిర్చే ప్రయత్నం చేసాం” అని చెప్పారు.



Next Story