రిచ్ లీగ్‌ ఐపీఎల్‌- 2020 సీజన్‌కు జరిగిన వేలం ముగిసింది. కోల్‌కతాలో జరిగిన వేలంలో కొంత‌మంది క్రికెటర్లకు ఊహించని ధరలకు అమ్ముడుపోగా.. మ‌రికొంత‌మంది స్టార్‌ క్రికెటర్లకు నిరాశే మిగిలింది. వేలంలో ఆసీస్ ఆట‌గాళ్లు ఈసారి స‌త్తా చాటారు. పాట్‌ కమ్మిన్స్‌, మ్యాక్స్‌వెల్‌లకు భారీ ధ‌ర ప‌లికి ఆశ్య‌ర్య ప‌ర‌చ‌గా… టీమిండియా ఆండర్‌-19 ఆట‌గాళ్లు యశస్వి జైస్వాల్‌, ప్రియాం గార్గ్‌లు ఫర్వాలేదనిపించారు.

అత్య‌ధికంగా.. కోల్‌కతా నైట్‌రైడర్స్‌ కమ్మిన్స్ ను రూ. 15 కోట్లకు ద‌క్కించుకోగా.. మ్యాక్స్‌వెల్ ను కింగ్స్‌ లెవెన్‌ పంజాబ్‌ రూ. 10.5 కోట్లకు ద‌క్కించుకుంది. అలాగే.. అన్‌క్యాప్‌డ్‌ ప్లేయర్స్ అయిన ప్రియాం గార్గ్‌-యశస్వి జైస్వాల్‌ల ప‌ట్ల పలు ఫ్రాంఛైజీలు పోటీ పడ్డాయి. అయితే.. ప్రియాం గార్గ్‌ను రూ. 1.90 కోట్లకు ఎస్‌ఆర్‌హెచ్‌ దక్కించుకోగా.. జైస్వాల్‌ను రూ. 2.40 కోట్లకు రాజస్తాన్‌ రాయల్స్‌ చేజిక్కించుకుంది.

ఒక‌ప్ప‌టి టీమిండియా ఆట‌గాడు పీయూష్‌ చావ్లాను రూ. 6.75 కోట్లకు చెన్నె సూపర్‌ కింగ్స్‌ కొనుగోలు చేసి అందరిని ఆశ్చ‌ర్యానికి గురిచేసింది. వేలంలో అత్య‌ధిక ధ‌ర ప‌లికిన మ‌రో విధ్వంస‌క‌ర బ్యాట్స్‌మెన్ హిట్‌మెయిర్‌ను ఢిల్లీ క్యాపిటల్స్‌ దక్కించుకుంది. అతని బేస్ ప్రైస్ రూ. 50 లక్షలు ఉండగా.. రూ. 7.75 కోట్లు వెచ్చించి ఢిల్లీ కొనుగోలు చేసింది. ఇక టీమిండియా ఆట‌గాళ్లు వినయ్‌ కుమార్, చతేశ్వర పుజారా, స్టువర్ట్‌ బిన్నీ, యూసఫ్‌ పఠాన్‌ ప‌ట్ల‌ ఏ ఫ్రాంఛైజీ ఆసక్తి చూపలేదు.

ఐపీఎల్‌-2020 సీజన్‌కు అమ్ముడుపోయిన ఆటగాళ్లు వీరే…

ప్యాట్‌ కమ్మిన్స్‌ : రూ.15.50 కోట్లు (కోల్‌కతా నైట్‌రైడర్స్‌)

గ్లెన్‌ మ్యాక్స్‌వెల్‌ : రూ.10.5 కోట్లు (కింగ్స్‌ లెవెన్‌ పంజాబ్‌)

క్రిస్‌ మోరిస్‌ : రూ. 10 కోట్లు (రాయల్‌ చాలెంజర్స్‌ బెంగుళూరు)

షెల్డన్‌ కాట్రెల్‌ : రూ. 8.50 కోట్లు (కింగ్స్‌ లెవెన్‌ పంజాబ్‌)

నాథన్‌ కౌల్టర్‌నీల్‌ : రూ. 8 కోట్లు (ముంబయి ఇండియన్స్‌)

షిమ్రోన్‌ హెట్‌మెయిర్‌ : రూ. 7.75 కోట్లు (ఢిల్లీ క్యాపిటల్స్‌)

పీయూష్‌ చావ్లా : రూ. 6.75 కోట్లు (చెన్నె సూపర్‌ కింగ్స్‌)

శామ్‌ కరణ్‌ : రూ. 5.50కోట్లు (చెన్నై సూపర్‌ కింగ్స్)

ఇయాన్‌ మోర్గాన్‌ : రూ. 5.25 (కోట్లు కోల్‌కతా నైట్‌రైడర్స్‌)

మార్కస్‌ స్టోయినిస్‌ : రూ.4.80 కోట్లు (ఢిల్లీ క్యాపిటల్స్‌)

ఆరోన్‌ పించ్‌ : రూ. 4.4 కోట్లు (రాయల్‌ చాలెంజర్స్‌ బెంగుళూరు)

వరుణ్‌ చక్రవర్తి : రూ. 4 కోట్లు (కోల్‌కతా నైట్‌రైడర్స్‌)

కేన్‌ రిచర్డ్‌సన్‌ : రూ. 4కోట్లు (రాయల్‌ చాలెంజర్స్‌ బెంగుళూరు)

జయదేవ్‌ ఉనద్కట్‌ : రూ. 3కోట్లు (రాజస్థాన్ రాయల్స్‌)

రాబిన్‌ ఊతప్ప : రూ. 3 కోట్లు (రాజస్థాన్‌ రాయల్స్‌)

క్రిస్‌ జోర్డాన్‌ : రూ. 3 కోట్లు (కింగ్స్‌ లెవెన్‌ పంజాబ్‌)

అలెక్స్‌ క్యారి : రూ.2.4 కోట్లు- (ఢిల్లీ క్యాపిటల్స్‌)

యశస్వి జైస్వాల్‌ : రూ. 2.40 కోట్లు (రాజస్థాన్‌ రాయల్స్‌)

క్రిస్‌ లిన్‌ : రూ.2 కోట్లు (ముంబయి ఇండియన్స్‌)

జోష్‌ హాజల్‌వుడ్‌ : రూ. 2 కోట్లు (చెన్నె సూపర్‌ కింగ్స్‌)

డేల్‌ స్టేయిన్‌ : రూ . 2కోట్లు (రాయల్‌ చాలెంజర్స్‌ బెంగళూరు)

మిచెల్‌ మార్ష్‌ : రూ. 2 కోట్లు (సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌)

విరాట్‌ సింగ్‌ : రూ .1.90 కోట్లు (సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌)

ప్రియమ్‌ గార్గ్‌ : రూ. 1.90 కోట్లు (సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌)

రవి బిష్ణోయి : రూ. 1.80 కోట్లు (కింగ్స్‌ లెవెన్‌ పంజాబ్‌)

జాసన్‌రాయ్‌ : రూ. 1.50 కోట్లు (ఢిల్లీ క్యాపిటల్స్‌)

క్రిస్‌ వోక్స్‌ : కనీస ధర రూ . 1.50 కోట్లు (ఢిల్లీ క్యాపిటల్స్‌)

కార్తిక్‌ త్యాగి : రూ. 1.30 కోట్లు (రాజస్థాన్‌ రాయల్స్‌)

టామ్ క్యూర‌న్ : రూ . 1 కోటి (రాజస్థాన్‌ రాయల్స్‌)

అండ్రూ టై : రూ . 1 కోటి (రాజస్థాన్‌ రాయల్స్‌)

టామ్‌ బాన్‌టన్‌ : రూ . 1 కోటి- (కోల్‌కతా నైట్‌రైడర్స్‌)

డేవిడ్‌ మిల్లర్‌ : రూ. 75 లక్షలు (రాజస్థాన్‌ రాయల్స్‌)

రాహల్‌ త్రిపాఠి : రూ .60 లక్షలు (కోల్‌కతా నైట్‌రైడర్స్‌)

పభ్‌ సిమ్రన్‌ సింగ్‌: రూ. 55 లక్షలు (కింగ్స్‌ లెవెన్‌ పంజాబ్‌)

ఇసురు ఉదానా : రూ . 50 లక్షలు (రాయల్‌ చాలెంజర్స్‌ బెంగళూరు)

దీపక్‌ హుడా : రూ. 50 లక్షలు (కింగ్స్‌ లెవెన్‌ పంజాబ్‌)

మోహిత్‌ శర్మ : రూ .50 లక్షలు (ఢిల్లీ క్యాపిటల్స్‌)

సారభ్‌ తివారి : రూ. రూ. 50 లక్షలు (ముంబయి ఇండియన్స్‌)

జిమ్మీ నీషమ్‌ : రూ. 50 లక్షలు (కింగ్స్‌ లెవెన్‌ పంజాబ్‌)

ఆ​కాశ్‌ సింగ్‌ : రూ. 20 లక్షలు- రాజస్థాన్‌ రాయల్స్‌ (కనీస ధర )

ఇషాన్‌ పోరేల్‌ : రూ. 20 లక్షలు (కింగ్స్‌ లెవెన్‌ పంజాబ్‌)

ఎం సిద్ధార్థ్‌ : రూ. 20 లక్షలు (కోల్‌కతా నైట్‌రైడర్స్‌)

సందీప్‌ బవానక : రూ.రూ. 20 లక్షలు (సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌)

క్రిస్‌ గ్రీన్‌ : రూ. 20 లక్షలు (కోల్‌కతా నైట్‌రైడర్స్‌)

జాషూవా ఫిలిప్‌ : రూ. 20 లక్షలు (రాయల్‌ చాలెంజర్స్‌ బెంగుళూరు )

ప్రవీణ్‌ తాంబే : రూ. 20 లక్షలు (కోల్‌కతా నైట్‌రైడర్స్‌)

అబ్దుల్‌ సమన్‌ : రూ. 20 లక్షలు (సన్‌రైజర్స్‌ హైదరాబాద్)

సంజయ్‌ యాదవ్‌ : రూ. 20 లక్షలు (సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌)

దిగ్విజయ్‌ దేశ్‌ముఖ్‌ : రూ. 20 లక్షలు (ముంబయి ఇండియన్స్‌)

పవన్‌ దేశ్‌ పాండే : రూ. 20 లక్షలు (రాయల్‌ చాలెంజర్స్‌ బెంగళూరు)

తుషార్‌దేశ్‌పాండే : రూ. 20 లక్షలు (ఢిల్లీ క్యాపిటల్స్‌)

ఆర్‌ సాయి కిషోర్‌ : రూ. 20 లక్షలు (చెన్నె సూపర్‌ కింగ్స్‌)

లలిత్‌ యాదవ్‌ : రూ. 20 లక్షలు (ఢిల్లీ క్యాపిటల్స్‌)

షాబాజ్‌ అహ్మద్‌ : రూ. 20 లక్షలు (రాయల్‌ చాలెంజర్స్‌ బెంగళూరు)

నిఖిల్‌ నాయక్‌ : రూ. 20 లక్షలు (కోల్‌కతా నైట్‌రైడర్స్‌)

న్యూస్‌మీటర్ తెలుగు

విశ్వసనీయమైన డిజిటల్ మీడియా ప్లాట్‌ఫారమ్ మీకు విశ్వసనీయ వార్తా కథనాలను మరియు ప్రస్తుత వ్యవహారాల విశ్లేషణను తెస్తుంది.