డయాబెటిస్‌ను ఆకులతో నియంత్రిస్తోన్న సాఫ్ట్‌వేర్‌ ఇంజినీర్‌..!

ఓ సాఫ్ట్‌వేర్‌ ఇంజినీర్ సంప్రాదయ మెడిసిన్‌ను వెలుగులోకి తెచ్చారు. రోజూ రెండు ఆకులను తినడం ద్వారా డయాబెటిస్‌ను..

By Srikanth Gundamalla  Published on  24 Jun 2023 7:15 AM GMT
Plantation, Diabetes, Sandeep, Software Engineer

డయాబెటిస్‌ను ఆకులతో నియంత్రిస్తోన్న సాఫ్ట్‌వేర్‌ ఇంజినీర్‌..!

డయాబెటిస్‌ గురించి అందరికీ తెలిసిందే. ఈ వ్యాధి చాలా మందిలో ఉంటుంది. వయసుతో సంబంధం లేకుండా చాలా మంది డయాబెటిస్‌తో బాధపడుతున్నారు. అయితే.. మధుమేహానికి ఇన్సులిన్‌ అందుబాటులో ఉంది. ఒక్కసారి ఈ వ్యాధి బారిన పడితే పూర్తిగా కోలుకోవడమంటూ ఉండదు.. నియంత్రణలో ఉంచుకోవాలి. ఈ క్రమంలో డయాబెటిస్‌ను కంట్రోల్‌లో ఉంచుకోవడానికి వైద్యులను సంప్రదించి రోజూ ట్యాబ్లెట్స్‌ వాడుతుంటారు. మెడిసిన్‌ వాడినంత మాత్రన వెంటనే రిజల్ట్‌ కనిపించదు. కొందరిలో అయితే డయాబెటిస్‌ పెరుగుతుంది తప్ప తగ్గదు. ఈ క్రమంలోనే ఓ సాఫ్ట్‌వేర్‌ ఇంజినీర్ సంప్రాదయ మెడిసిన్‌ను వెలుగులోకి తెచ్చారు. రోజూ రెండు ఆకులను తినడం ద్వారా త్వరగా డయాబెటిస్‌ను నియంత్రించవచ్చని సందీప్‌ చెబుతున్నారు. అసలు ఎలా దీన్ని వెలుగులోకి తెచ్చారు..? ఆ ఆకులు ఎలా పనిచేస్తున్నాయనే దానిపై సందీప్‌తో న్యూస్‌ మీటర్‌ స్పెషల్‌ ఇంటర్వ్యూ.

ఆయన పేరు సందీప్‌ మొటమర్రి. హైదరాబాద్‌లోని మెహదీపట్నంలో నివాసం ఉంటున్నారు. సందీప్ మాట్లాడుతూ.. "నేనూ కూడా డయాబెటిక్‌ పేషెంట్‌నే. నా వయసు 60 సంవత్సరాలు. సాఫ్ట్‌వేర్‌ ఉద్యోగిగా పని చేశాను. ప్రస్తుతం రిటైర్డ్ అయ్యాను. 15 ఏళ్ల కిందటి నుంచి డయాబెటిస్‌తో బాధపడుతున్నాను. కొన్నేళ్ల పాటు ట్యాబ్లెట్స్‌ వాడాను. ఎలాంటి ప్రభావం చూపలేదు. గత కొన్నాళ్ల క్రితం పతాంజలి వారు హైదరాబాద్‌లోనే డయాబెటిస్‌కు సంబంధించిన కొన్ని మొక్కలు అమ్మారు. నేను వెళ్లి తెచ్చుకున్నాను. ట్యాబ్లెట్స్‌తో పాటు ఈ ఆకులను కూడా తిన్నాను. క్రమంగా డయాబెటిస్‌ లెవల్స్‌ కంట్రోల్‌ ఉండటం గమనించాను. 1000 ఎంజీ ట్యాబ్లెట్స్‌ వాడేవాడిని. నేనూ ఆకులు తింటూ ట్యాబ్లెట్స్‌ కొంత కాలం వాడాను. ఆకు బాగా పనిచేస్తోందని గుర్తించాను. ఆ తర్వాత ట్యాబ్లెట్స్‌ వాడటం ఆపేసి. కేవలం ఆకులు మాత్రమే తీసుకుంటున్నాను. నేను ఇప్పుడు శారీరంగా ధృడంగా ఉన్నాను. ఆకులు డయాబెటిస్‌పై బాగా పనిచేస్తున్నాయి. ఏడేళ్లుగా ఆకులు తింటున్నాను.సైడ్‌ ఎఫెక్ట్స్‌ కూడా ఏమీ లేవు" అని సందీప్‌ తెలిపారు.

"నాలుగు, అయిదు రకాల మొక్కలు ఉంటాయి. నా దగ్గర ఒకే జాతి మొక్క ఉంది. దీని పేరు కాస్టస్ ఇగ్నియస్ (Costus Igneus)". దీనికి ఎల్లో కలర్‌ పూలు పూస్తాయి. మిగతా వాటికి వేర్వేరు కలర్లలో పూలు పూస్తాయి. రీసెంట్‌గా ఒక పేషెంట్‌కు ఆకులు ఇచ్చాను.. తన డయాబెటిస్‌ రీడింగ్‌ 340 నుంచి 113కి తగ్గింది. మరో 50 ఏళ్ల పెషేంట్‌కు కూడా ఆకులు ఇచ్చాను ఆమె కూడా త్వరగా కోలుకున్నారు. ఆకు రోజుకు రెండు తినాలి. గోంగూర రుచిని కలిగి ఉంటుంది. ముంబైలో ఒక 12 ఏళ్ల బాలుడు డయాబెటిస్‌ వ్యాధి బారిన పడ్డాడు. అతను రోజుకు నాలుగు సార్లు ఇన్సులిన్‌ వేసుకోవాలి. ఈ ఆకు గురించి తెలుసుకుని అతని తండ్రి ముంబై నుంచి వచ్చి మొక్కను తీసుకెళ్లారు. ఆకు వాడుతూ ఇన్సులిన్‌ ఒక్కసారి వేసుకుంటే సరిపోతుంది. ప్రస్తుతం ఆ బాబు ఆరోగ్యం బాగుందని చెప్పారు. కాస్టస్ ఇగ్నియస్ ఆకు వాడినవారు స్పీడ్‌ రికవరీ ఫీల్‌ ఉందని చెబుతుంటారు".

"మొక్క కావాలనుకునే వారు మా ఇంటికి వచ్చి తీసుకెళ్లాలి. ఎందుకంటే నేను మొక్క గురించి అన్ని వివరాలు చెప్తాను. మొక్కను ఎలా పెంచాలి.. ఎలా వాడాలి అనే విషయాలు వివరిస్తాను. ఏ వయసులో ఉన్నవారు అయినా ఈ ఆకులను తినొచ్చు. 2 ఏళ్ల నుంచి 90 ఏళ్ల వయసు ఉన్నవారు ఈ మొక్క ఆకులు తినొచ్చు. అయితే.. ప్రెగ్నెన్సీ సమయంలో, డెలివరీ అయిన వారు మాత్రం 8 నెలల వరకు ఈ మొక్కను తినకూడదు. కాస్టస్‌ ఇగ్నియస్‌ మొక్కలను నేనే ప్లాంటేనేషన్‌ చేస్తున్నాను. నా ఇంటి టెర్రస్‌పైనే మొక్కలు పెంచుతున్నారు. నా ఇంటికి వచ్చిన వారికి అన్నీ వివరించి.. మొక్కలను ఇస్తాను. మొక్కల ధరలు కూడా అందరికీ అందుబాటులో ఉంటాయి. గార్డెన్‌ బ్యాగ్‌లో వేసి మొక్క ఇస్తాను. సేంద్రీయ పద్ధతిలోనే మొక్కలను పెంచుతాను. మొక్కల పెంపకంలో ఆవుపేడ, గోమూత్రం వాడుతాను" అని సందీప్ అన్నారు.

" నా ఇంటికి వచ్చి మొక్కలు తీసుకెళ్లే వారికి డైట్‌ చెప్తాను. ఏ ఫుడ్‌ తీసుకోవాలనే విషయాలను వివరిస్తాను. వరల్డ్‌ వైడ్‌గా డయాబెటిక్‌ పేషెంట్లు వచ్చి మొక్కలు కొనుక్కుని వెళ్తున్నారు. ఆన్‌లైన్‌లో డెలివరీ చేయడం లేదు. ఇంటి వద్దకు వచ్చినవారకే మొక్కను ఇస్తున్నాను" అని సందీప్ తెలిపారు. కాగా.. తాను ప్రభుత్వం నుంచి ఎలాంటి సాయం కోరుకోవడం లేదని ఈ సందర్భంగా చెప్పారు సందీప్ మొటమర్రి.

కాస్టస్ ఇగ్నియస్ (Costus Igneus) మొక్క గురించి మరిన్ని వివరాలు తెలుసుకోవాలన్నా.. దీన్ని కొనుక్కోవాలనుకున్నా సందీప్‌ మొటమర్రిని సంప్రదించవచ్చు. సందీప్ ఫోన్‌ నెంబర్: 98857-23243.

Next Story