కొత్త చట్టం.. 16 ఏళ్లలోపు వారు సోషల్‌ మీడియా వాడటం నిషేధం

ప్రస్తుతకాలం డిజిటల్‌ మయం అయిపోయింది. అందరి వద్ద సెల్‌ఫోన్లు ఉన్నాయి.

By Srikanth Gundamalla  Published on  24 Feb 2024 10:45 AM IST
16 years child,  social media, florida,

 కొత్త చట్టం.. 16 ఏళ్లలోపు వారు సోషల్‌ మీడియా వాడటం నిషేధం

ప్రస్తుతకాలం డిజిటల్‌ మయం అయిపోయింది. అందరి వద్ద సెల్‌ఫోన్లు ఉన్నాయి. స్కూల్‌ పిల్లల నుంచి వృద్ధుల వరకు అంతా సెల్‌ఫోన్లు యూజ్‌ చేస్తున్నారు. ప్రపంచంలో ఎక్కడేం జరిగినా క్షణంలో సోషల్‌ మీడియా ద్వారా తెలిసిపోతుంది. అయితే.. సోషల్‌ మీడియాకు చాలా మంది పిల్లలు కూడా అడిక్ట్ అయిపోతున్నారు. రీల్స్‌ చేస్తూ ఫేమస్ అవ్వాలని ప్రయత్నిస్తున్నారు.ఈ నేపథ్యంలో సోషల్‌ మీడియాకు అడిక్ట్‌ అయి లైఫ్‌ను పట్టించుకోకుండా పోతున్న తరుణంలో అమెరికాలోని ఫ్లోరిడా రాష్ట్రంలో కొత్త చట్టాన్ని తీసుకొస్తున్నారు.

ఫ్లోరిడాలో కొత్త బిల్లు ప్రకారం సోషల్‌ మీడియా ప్లాట్‌ఫామ్‌ను 16 ఏళ్ల లోపు పిల్లలు వాడటానికి వీలులేదు. ఆన్‌లైన్‌ వల్ల పిల్లల మానసిక పరిస్థితి దెబ్బతింటోందనీ గుర్తించిన ఫ్లోరిడా ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది. చట్టసభలో పాసైన ఈ చట్టం ప్రస్తుతం రిపబ్లికన్‌ గవర్నర్ రాన్‌ డీసాంటిస్‌ వద్దకు వెళ్లనుంది. అక్కడ ఆమోదం పొందిన తర్వాత అమల్లోకి రానుంది. కాగా.. ఫ్లోరిడా హౌజ్‌ ఆఫ్‌ రిప్రజెంటేటివ్స్‌లో ఈ బిల్లుకు 108-7 ఓట్లు పోల్‌ అయ్యాయి. సెనేట్‌ నుంచి కూడా ఈ బిల్లుకు ఆమోదం దక్కింది. కొందరు విమర్శకులు మాత్రం బిల్లుపై అభ్యంతరాలు వ్యక్తం చేస్తున్నారు. అమెరికా రాజ్యాంగంలోని తొలి సవరణను బిల్లు ఉపసంహరిస్తోందని ఆరోపిస్తున్నారు. ఇక ఈ బిల్లును మెటా సంస్థ కూడా తప్పుబట్టింది.

ఈ చట్టం ప్రకారం 16 ఏళ్ల లోపు పిల్లల సోషల్‌ మీడియా అకౌంట్లను టర్మినేట్‌ చేయనున్నారు అధికారులు. అండర్‌ ఏజ్‌ ఉన్న పిల్లలను స్క్రీనింగ్ చేసేందుకు థర్డ్‌పార్టీ వెరిఫికేషన్ వ్యవస్థను రూపొందిస్తున్నారు. ఇక ఈ కొత్తబిల్లుపై తుది నిర్ణయం తీసుకుంటామని గవర్నర్‌ డిసాంటిస్ తెలిపారు. తాను కూడా సోషల్‌ మీడియా వల్ల పిల్లలపై ప్రబావం పడుతుందనే వాదనతో ఏకీభవిస్తున్నట్లు చెప్పారు. అయితే.. సోషల్‌ మీడియాను పూర్తిగా దూరం పెట్టకుండా ఉండాలంటే తల్లిదండ్రుల సమక్షంలో వాడొచ్చనే అభిప్రాయాన్ని తెలిపారు.

Next Story