కరడుగట్టిన అంతర్జాతీయ ఉగ్రవాదికి 10 ఏళ్ల జైలు శిక్ష
Terrorist Hafiz Saeed 10 Years Jail .. కరడుగట్టిన అంతర్జాతీయ ఉగ్రవాది, ముంబై పేలుళ్ల కుట్రలో ప్రధాన సూత్రదారి హఫీజ్
By సుభాష్ Published on
19 Nov 2020 2:19 PM GMT

కరడుగట్టిన అంతర్జాతీయ ఉగ్రవాది, ముంబై పేలుళ్ల కుట్రలో ప్రధాన సూత్రదారి హఫీజ్ సయీద్‌కు 10 ఏళ్ల జైలు శిక్ష పడింది. ఉగ్రవాద దాడులకు సంబంధించి రెండు కేసుల్లో పాక్ ఉగ్రవాద వ్యతిరేక న్యాయస్థానం అతనికి ఈ శిక్ష విధిస్తూ తీర్పునిచ్చింది. జమాత్ ఉల్ దవా సంస్థ చీఫ్‌గా ఉన్నసయీద్ 2008 ముంబై పేలుళ్ల వెనుక ప్రధాన సూత్రధారి. ఉగ్రవాద సంస్థలకు నిధులు అందిస్తున్నారన్న కేసులో ఇప్పటికే 11 ఏళ్లు జైలు శిక్ష పడగా, ఈతడు ప్రస్తుతం లాహోర్‌లోని ఓ జైలులో శిక్ష అనుభవిస్తున్నాడు. తాజాగా హఫీజ్ తో పాటు మరో నలుగురికి పాక్ ఉగ్రవాద వ్యతిరేక న్యాయస్థానం జైలు శిక్ష విధించింది.
కాగా, ఉగ్రవాద సంస్థ లష్కరే తోయిబాకు ముందుండి అన్ని తానై చూసుకునే జేయూడీ చీఫ్‌గా ఉన్న సయీద్ ఐక్యరాజ్య సమితి ప్రకటించిన అంతర్జాతీయ ఉగ్రవాదుల జాబితాలోనూ ఉన్నాడు. అలాగే అమెరికా అతనిపై 10 మిలియన్ డాలర్ల పారితోషకం కూడా ప్రకటించింది. 2008 ముంబై పేలుళ్లలో 166 మంది మృతి చెందగా, వందలాది మంది గాయపడ్డారు.
Next Story