ప్రపంచ సాహిత్యంలో 2021 నోబెల్ పురస్కారం బ్రిటీష్ నవలా రచయిత అబ్దుల్ రజాక్ గుర్నాకు దక్కింది. వలసవాదం, శరణార్థుల సమస్యలను ప్రభావవంతంగా వివరించారు రజాక్. వివిధ ఖండాలు, సంస్కృతుల నడుమ శరణార్థులు ఎలా నలిగిపోతున్నారో తన రచనల ద్వారా తెలియజేశారు. తాను చెప్పాల్సిన దానిని ఎలాంటి రాజీతత్వం అవలంబించకుండా సూటిగా చెప్పిన రజాక్ శైలి తమను ఆకట్టుకుందని నోబెల్ ప్రైజ్ కమిటీ తెలిపింది. ఆఫ్రికా దేశం జాంజిబార్ లో జన్మించిన అబ్దుల్ రజాక్ గుర్నా ఓ విద్యార్థిగా బ్రిటన్ లో అడుగుపెట్టి అక్కడే ఉన్నారు. పారడైజ్, బై ద సీ, డెజర్షన్ అనే నవలలతో ప్రపంచవ్యాప్త గుర్తింపు అందుకున్నారు.
1948లో అబ్దుల్ రజాక్ జన్మించారు. జంజీబర్ దీవుల్లో ఆయన పెరిగారు. 1960 దశకంలో ఓ శరణార్థిగా ఆయన ఇంగ్లండ్ చేరుకున్నారు. ఇటీవలే ఆయన రిటైర్ అయ్యారు. క్యాంట్‌బెరీలోని కెంట్ యూనివర్సిటీలో ఇంగ్లష్ అండ్ పొస్ట్ కొలోనియల్ లిటరేచర్ విభాగంలో ప్రొఫెసర్‌గా పనిచేశారు. అబ్దుల్‌రజాక్ మొత్తం పది నవలను రాశారు. ఇంకా ఎన్నో చిన్న కథలను పబ్లిష్ చేశారు.