అరాచకం.. గర్భంతో ఉన్న పోలీస్ అధికారిణిని కాల్చిచంపిన తాలిబన్లు..!

Taliban Kills Pregnant Afghan Police woman In Front Of Her Family. గర్భిణి అయిన ఆఫ్ఘన్ పోలీసు మహిళను

By M.S.R  Published on  6 Sep 2021 3:30 PM GMT
అరాచకం.. గర్భంతో ఉన్న పోలీస్ అధికారిణిని కాల్చిచంపిన తాలిబన్లు..!

గర్భిణి అయిన ఆఫ్ఘన్ పోలీసు మహిళను తాలిబాన్లు ఆమె కుటుంబం ముందే కాల్చి చంపారని ఆఫ్ఘన్ జర్నలిస్టులు చెబుతున్నారు. ఘోర్ ప్రావిన్స్‌లో.. బాను నిగారా అనే పోలీసు మహిళ 8 నెలల గర్భవతి అని.. తన భర్త మరియు పిల్లల ముందు ఆమెను తాలిబాన్లు చంపేసినట్లు జర్నలిస్ట్ తెలిపారు.

అయితే ఈ హత్యలో తమ సంస్థకు సంబంధం లేదని తాలిబాన్ అధికార ప్రతినిధి జబివుల్లా ముజాహీద్ తెలిపారు. తాలిబాన్లు ఆమెను చంపలేదని.. మా విచారణ కొనసాగుతోంది అని తాలిబాన్లు తెలిపారు. వ్యక్తిగత శత్రుత్వం లేదా మరేదైనా కారణం ఆమె హత్య వెనుక ఉండొచ్చని తాలిబాన్ ప్రతినిధులు వెల్లడించారు. మొదట ముగ్గురు వ్యక్తులు ఆమె ఇంటికి వచ్చారని ఇల్లు మొత్తాన్ని వెతికారు. ఆమెను చంపడానికి ముందు కుటుంబ సభ్యుడిని కట్టివేశారని తెలిపారు. ఈ సంఘటన శనివారం జరిగింది.

తాలిబాన్ల విషయంలో అమెరికన్ మరియు నాటో దళాలకు సహకరించిన వారిని వేటాడేందుకు తాలిబాన్లు ఇంటింటికీ వెళ్లినట్లు అనేక నివేదికలు వచ్చాయి. అమెరికన్లకు సహాయం చేసిన వారిని తాలిబాన్లు శిక్షిస్తూ వస్తున్నారు. మరోవైపు తమ హక్కులు కాపాడాలని.. అన్నిట్లోనూ తమకు అవకాశాలు కల్పించాలని మహిళలు ఓ వైపు పలు నగరాల్లో నిరసన కార్యక్రమాలు చేపట్టారు. ఆఫ్ఘన్ ప్రధాన పట్టణాల వీధుల్లో వేల మంది మహిళలు తాలిబాన్లకు వ్యతిరేకంగా ర్యాలీలు నిర్వహిస్తున్నారు. తాలిబాన్లు మహిళలపై ఎన్నో కఠిన ఆంక్షలను అమలు చేస్తూ వస్తున్నారు.

Next Story