జైల్లో ఘర్షణ.. 8 మంది ఖైదీలు మృతి.. 50 మందికి గాయాలు.. పలువురి పరిస్థితి విషమం

Sri Lankan prison riot leaves 8 inmates dead .. శ్రీలంక దక్షిణ ప్రావిన్స్‌లో ని మహారా కారాగారంలో ఖైదీల మధ్య ఘర్షణ చోటు

By సుభాష్  Published on  30 Nov 2020 11:33 AM GMT
జైల్లో ఘర్షణ.. 8 మంది ఖైదీలు మృతి.. 50 మందికి గాయాలు.. పలువురి పరిస్థితి విషమం

శ్రీలంక దక్షిణ ప్రావిన్స్‌లో ని మహారా కారాగారంలో ఖైదీల మధ్య ఘర్షణ చోటు చేసుకుంది. ఈ ఘర్షణలో 8 మంది ఖైదీలు మృతి చెందగా, మరో 50 మంది ఖైదీలకు తీవ్ర గాయాలైనట్లు తెలుస్తోంది. పరిస్థితిని అదుపు చేసేందుకు జైలు అధికారులు , సిబ్బంది తీవ్రంగా ప్రయత్నించారు. అంతేకాకుండా ఈ ఘర్షణ సందర్భంగా పలుమార్లు గాల్లో కాల్పులు జరిపినట్లు కొలంబో పోలీసు అధికార ప్రతినిధి డీఐజీ అజిత్‌ రోహన్‌ తెలిపారు. ఓ వర్గానికి చెందిన ఖైదీలకు కరోనా సోకడంతో మరో వర్గానికి చెందిన ఖైదీలు ఆదివారం మధ్యాహ్నం జైలు నుంచి పరారయ్యేందుకు ప్రయత్నించగా, ఈ ఘర్షణ చోటు చేసుకున్నట్లు సమాచారం.

కాగా, పరిస్థితిని అదుపులోకి తీసుకువచ్చేందుకు జైలులో సిబ్బందికి సాయంగా కిలానియా ఎస్‌ఎస్‌పీ ఆధ్వర్యంలో ప్రత్యేక టాస్క్‌ఫోర్స్‌ పోలీసులు రంగంలోకి దిగారు. ఈ ఘటనపై ఆ రాష్ట్ర జైళ్ల శాఖ మంత్రి డాక్టర్‌ సుదర్శినీ ఫెర్నాడోపుల్లే పార్లమెంట్‌లో స్పందిస్తూ జైళ్ల మంత్రిత్వ శాఖ కార్యదర్శి అధ్యక్షతన స్వతంత్ర సంస్థతో దర్యాప్తు జరిపిస్తామని అన్నారు. నేర దర్యాప్తు విభాగంతో విచారణ జరిపితే మరిన్ని వాస్తవాలు బయటకు వస్తాయని ఆమె పేర్కొన్నారు. 8 మంది మృతదేహాలను సమీపంలో రగామా ఆస్పత్రికి తరలించారు. గాయపడిన 55 మందిలో పలువురు పరిస్థితి విషమంగా ఉన్నట్లు అధికారులు తెలిపారు.

Next Story