శనివారం ఏర్పడే సూర్యగ్రహణానికి ప్రత్యేకత.. 'రింగ్ ఆఫ్ ఫైర్'
ఈ నెల 14న శనివారం సంపూర్ణ సూర్యగ్రహణం ఏర్పడనుంది. అయితే .. ఈ సూర్యగ్రహణానికి ఓ ప్రత్యేకత ఉంది.
By Srikanth Gundamalla Published on 13 Oct 2023 4:53 AM GMTశనివారం ఏర్పడే సూర్యగ్రహణానికి ప్రత్యేకత.. 'రింగ్ ఆఫ్ ఫైర్'
ఈ నెల 14న శనివారం సంపూర్ణ సూర్యగ్రహణం ఏర్పడనుంది. అయితే .. ఈ సూర్యగ్రహణానికి ఓ ప్రత్యేకత ఉంది. సూర్యగ్రహణం సమయంలో అత్యంత అరుదుగా ఏర్పడే 'రింగ్ ఆఫ్ ఫైర్' అంటే ఉగరం ఆకృతిలో సూర్యవలయం కనపించనుంది. ఇది అమెరికా, మెక్సికో సహా దక్షిణ, హద్య అమెరికాలోని పలు దేశాల్లో మాత్రమే కనపడనుంది. ఈ దేశాల్లో 'రింగ్ ఆఫ్ ఫైర్' చివరిసారిగా 2012లో కనిపించింది. ఆ తర్వాత ఇప్పుడే రింగ్ ఆఫ్ ఫైర్ ఆవిష్కృతం కాబోతుంది.
సూర్యుని లోపల ఒక నల్లని ఆకారం ఏర్పడనుంది. ఫలితంగా సూర్యుని చుట్టూ అగ్ని వలయం కనిపించనుంది. దీనినే ‘రింగ్ ఆఫ్ ఫైర్’ అని పిలుస్తారు. సూర్యగ్రహణం కారణంగా సూర్యుడు ఈ రీతిలో కనిపించనున్నాడు. అయితే.. సూర్యగ్రహణం ఏర్పడే ప్రతీసారి ఇలా జరగదు. చంద్రుని ప్రత్యేక స్థానం కారణంగా ఇలా జరుగుతుంది. భూమికి, సూర్యుడికి మధ్య చంద్రుడు వచ్చినప్పుడు.. చంద్రుని నీడ భూమిపై పడుతుంది. అక్టోబర్ 14న ఇలాంటి సూర్యగ్రహణమే ఏర్పడుతుంది. ఇక ఈ సూర్యగ్రహణం తర్వాత 2046 వరకు 'రింగ్ ఆఫ్ ఫైర్' కనిపించదంటూ సైంటిస్టులు చెబుతున్నారు. సూర్యగ్రహణం వేళ ఏర్పడే అద్భుతమైన వలయం చూసే అవకాశం అరుదుగా వస్తుందనీ.. ప్రజలు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని నాసా సైంటిస్టులు చెబుతున్నారు. అక్టోబర్ 14న సాయంత్రం 4.30 గంటలకు అంతరిక్షంలో సంభవిస్తున్న అరుదైన దృశ్యాన్ని నాసా ప్రత్యక్ష ప్రసారం చేయనుంది.
ఈ సూర్యగ్రహణం భారత్‌లో కనిపించదు. ఎందుకంటే ఈ సూర్యగ్రహణం సమయానికి భారతదేశంలో రాత్రి అవుతుంది. గ్రహణం సమయంలో భారతదేశం చంద్రుడికి వ్యతిరేక దిశలో ఉంటుంది. భారతదేశంలో చంద్రుడు కనిపించే సమయానికి సూర్యగ్రహణం ముగుస్తుంది. నాసా ప్రత్యక్ష ప్రసారం ద్వారా మాత్రం ఈ సూర్యగ్రహణాన్ని భారత్‌లోని ప్రజలు వీక్షించవచ్చు. భారత కాలమానం ప్రకారం రాత్రి 8.35 గంటలకు దీన్ని లైవ్ ద్వారా వీక్షించవచ్చు.