కరోనా వ్యాక్సిన్‌పై రష్యా కీలక ప్రకటన

Russian Sputnik V vaccine ... ప్రపంచ వ్యాప్తంగా కరోనా మహమ్మారి తీవ్ర స్థాయిలో విజృంభిస్తోంది. వైరస్‌కు ఎలాంటి వ్యాక్సిన్‌ లేని

By సుభాష్  Published on  25 Nov 2020 4:20 AM GMT
కరోనా వ్యాక్సిన్‌పై రష్యా కీలక ప్రకటన

ప్రపంచ వ్యాప్తంగా కరోనా మహమ్మారి తీవ్ర స్థాయిలో విజృంభిస్తోంది. వైరస్‌కు ఎలాంటి వ్యాక్సిన్‌ లేని కారణంగా పాజిటివ్‌ కేసులు, మరణాలు పెరిగిపోతున్నాయి. కరోనాను అరికట్టేందుకు భారత్‌తో పాటు ఇతర దేశాలన్ని వ్యాక్సిన్‌ కనిపెట్టేందుకు తీవ్రంగా శ్రమిస్తున్నాయి. అయితే ఎంతో ఆతృతగా ఎదురు చూస్తున్న ఈ వ్యాక్సిన్‌పై రష్యా దేశం కీలక ప్రకటన చేసింది. స్పుత్నిక్‌-వి వ్యాక్సిన్‌ 95 శాతం సమర్థంగా పని చేస్తుందని ప్రకటించింది. తొలి డోస్‌ ఇచ్చిన 42 రోజుల తర్వాత ఫలితాలను విశ్లేషించామని, ఫలితాలను పరిశీలించాక వ్యాక్సిన్‌ 95శాతం మెరుగ్గా పని చేస్తుందని తెలిపింది.

రష్యాలో గమలేయా నేషనల్‌ రిసెర్చ్‌ సెంటర్‌, రష్యన్‌ డైరెక్ట్‌ ఇన్వెస్ట్‌మెంట్‌ ఫండ్‌ సంయుక్తంగా ఈ వ్యాక్సిన్‌ను అభివృద్ధి చేస్తున్నాయి. కరోనా వచ్చిన తొలినాళ్లలోనే చాలా వేగంగా ప్రయోగాలు చేపట్టి స్పుత్నిక్‌-వి వ్యాక్సిన్‌ రూపొందించి ప్రపంచ దేశాలను ఆశ్చర్యంలో ముంచెత్తింది. మరోసారి మెరుగైన ఫలితాలను సాధించి వ్యాక్సిన్‌ రేసులో ముందున్నామని ఆ దేశం ప్రకటించింది. మరికొన్ని రోజుల్లో రష్యా మరింత మెరుగైన ఫలితాలు ప్రకటించే అవకాశం ఉందని నిపుణులు చెబుతున్నారు.

అందుబాటులోకి వచ్చే ఈ వ్యాక్సిన్‌ ధర కూడా పెద్దగా ఉండదని, సామాన్యుడికి అందుబాటులో ఉండేలా ధరను నిర్ణయిస్తామని తెలిపింది. మిగతా టీకాల కంటే తమ వ్యాక్సిన్‌కు చాలా తక్కువ ధరుంటుందని ఇప్పటికే ప్రకటన చేసింది. మరోవైపు భారత్‌లో రష్యాకు చెందిన స్పుత్నిక్‌-వి వ్యాక్సిన్‌ ప్రయోగాలు ఈ వారంలోనే ప్రారంభం కానున్నాయి. భారత్‌లో ఫేజ్‌2, ఫేజ్‌3 ట్రయల్స్‌ రెండింటిని కలిపి చేయనున్నట్లు తెలిపింది.

Next Story