ఒలింపిక్స్‌ స్విమ్మర్లపై టీవీ వ్యాఖ్యాత అభ్యంతరకర వ్యాఖ్యలు, తొలగింపు

పారిస్‌ ఒలింపిక్స్‌ అట్టహాసంగా కొనసాగుతున్నాయి.

By Srikanth Gundamalla  Published on  29 July 2024 8:00 AM IST
paris olympics, tv commentator, comments,  swimmers ,

ఒలింపిక్స్‌ స్విమ్మర్లపై టీవీ వ్యాఖ్యాత అభ్యంతరకర వ్యాఖ్యలు, తొలగింపు 

పారిస్‌ ఒలింపిక్స్‌ అట్టహాసంగా కొనసాగుతున్నాయి. భారత్‌ ఇందులో బోణి కొట్టింది. షూటింగ్‌లో కాంస్య పతకాన్ని సొంతం చేసుకుంది. మను బాకర్‌ షూటింగ్‌లో పతకం సాధించిన భారత తొలి మహిళగా అవతరించిన విషయం తెలిసిందే. పారిస్‌ ఒలింపిక్స్‌లో ఓ కామెంటేటర్‌ చేసిన కామెంట్స్ ప్రస్తుతం వైరల్‌ అవుతున్నాయి. ఆస్ట్రేలియా మహిళల స్విమ్మింగ్ జట్టుపై అతను అభ్యంతకర కామెంట్స్‌ చేశాడు.

టెలివిజన్ బ్రాడ్‌కాస్టర్ యూరోస్పోర్ట్ ఆదివారం పారిస్‌ ఒలింపిక్స్ కవరేజీలో భాగంగా స్విమ్మింగ్ పోటీల గురించి ప్రసారం చేసింది. ఇందులో టీవీ వ్యాఖ్యాతగా ఉన్న బాబ్ బల్లార్డ్ ఆస్ట్రేలియా స్విమ్మర్ల గురించి సెక్సీయెస్ట్ అనే కామెంట్స్ చేశాడు. శనివారం జరిగిన మహిళల 4x100 మీటర్ల ఫ్రీస్టైల్ రిలే స్వర్ణం గెలిచిన తర్వాత ఆస్ట్రేలియా స్విమ్మర్ల గురించి బాబ్ బల్లార్డ్ ఇలా వ్యాఖ్యానించాడు. అతను ఇంకొన్ని వ్యాఖ్యలను కూడా చేశాడు. ‘ ఒకే.. మహిళలూ పూర్తి చేశారు. వీళ్ల గురించి తెలిసిందేగా.. మేకప్ గట్రా అంటూ తీరిగ్గా ఉంటారు’’ అని లైవ్‌లో సంచలన కామెంట్స్ చేశాడు. ఈ కామెంట్స్‌పై అభ్యంతరాలు వ్యక్తం అయ్యాయి. మరోవైపు నెట్టింట ఈ వీడియో క్లిప్ వైరల్ కావడంతో విమర్శలు వెల్లువెత్తాయి. దాంతో.. స్పందించిన యాజమాన్యం చర్యలు తీసుకుంది. మరుసటి రోజు యూరోస్పోర్ట్స్ ఓ ప్రకటన విడుదల చేసింది. మహిళలపై బలార్డ్ అభ్యంతరకర వ్యాఖ్యలు చేశారని అంగీకరించింది. ఆయనను తక్షణం ఉద్యోగంలో నుంచి తీసేసినట్లు వెల్లడించింది. అయితే, ఈ కాంట్రవర్సీపై బలార్డ్ ఇంకా స్పందించలేదు.

Next Story