పాకిస్తాన్‌లో భారీ పేలుడుకి ముందు వీడియో వైరల్‌

పాకిస్తాన్‌లో భారీ పేలుడు సంభవించింది. ఓ రాజకీయ పార్టీ సమావేశమే లక్ష్యంగా ఈ పేలుడు జరిగింది.

By Srikanth Gundamalla  Published on  31 July 2023 7:47 AM IST
Pakistan, Blast, Video, 50 Dead, Political Meeting,

పాకిస్తాన్‌లో భారీ పేలుడుకి ముందు వీడియో వైరల్‌

పాకిస్తాన్‌లో భారీ పేలుడు సంభవించింది. ఓ రాజకీయ పార్టీ సమావేశమే లక్ష్యంగా ఈ పేలుడు జరిగింది. ఈ సంఘటనలో 50 మంది చనిపోయినట్లు తెలుస్తోంది. వందకు పైగా మందికి గాయాలు అయ్యాయి. అయితే.. పేలుడు సంభవించిన తర్వాత ఆ ప్రాంతమంతా రక్తసిక్తంగా మారింది. సమాచారం తెలుసుకున్న ఫైరింజన్లు, పోలీసులు.. అంబులెన్స్‌లు ఘటనాస్థలానికి చేరుకున్నాయి. గాయపడ్డవారిని వెంటనే ఆస్పత్రికి తరలించారు. ఆ తర్వాత పోలీసులు పేలుడు జరిగిన ప్రదేశంలో క్లూస్‌ వెతికే పనిలో పడ్డారు. కాగా.. పేలుడు సమయంలో పలువురు వీడియోలు తీశారు. ఆ వీడియోల్లో అక్కడి నేతలు చేస్తున్న నినాదాలు.. ఆ తర్వాత బాంబు పేలుడు దృశ్యాలు కనిపిస్తున్నాయి. పేలుడు సంభవించగానే సమావేశంలో ఉన్నవారంతా ఒక్కసారిగా పరుగులు తీస్తున్నారు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్‌ మీడియాలో వైరల్ అవుతోంది.

పాకిస్థాన్‌లోని ఖైబర్ పఖ్తుంఖ్వాలోని బజౌర్ ప్రాంతంలో జమియత్-ఉలేమా-ఎ-ఇస్లాం-ఫజల్ (జెయూఏ-ఎఫ్) సమావేశంలో ఈ పేలుడు సంభవించింది. పేలుడు తర్వాత ఆ ప్రాంతమంతా యుద్ధవాతావరణం కనిపించింది. పేలుడులో 30 మంది అక్కడికక్కడే చనిపోయారు. ఇంకొందరు ఆస్పత్రుల్లో చికిత్స పొందుతూ ప్రాణాలు కోల్పోయారు. మరో వందమంది వరకు గాయాలు అయినట్లు సమాచారం. జేయూఏ-ఎఫ్‌ కార్యకర్తల సదస్సు లక్ష్యంగానే ఈ పేలుడు జరిగింది. దుబాయ్‌ మోర్‌ సమీపంలో ఈ దుర్ఘటన చోటుచేసుకుంది.

పేలుడు సమయంలో తీసిన వీడియోలు సోషల్‌ మీడియాలో వైరల్ అవుతున్నాయి. పేలుడు ధాటికి అందరూ ఒక్కసారిగా భయపడిపోయారు. ఇంకేమైనా బ్లాస్ట్‌లు జరుగుతామయేమో అని భయంతో పరుగు తీశారు. పేలుడు తీవ్రస్థాయిలో ఉందని చెబుతున్నారు. పేలుడు శబ్ధం రెండు కిలోమీటర్ల వరకు వినిపించినట్లు స్థానికులు అంటున్నారు. అయితే.. పేలుడు ఎలా జరిగిందన్న విషయంపై ఇప్పుడే చెప్పలేమని అక్కడి పోలీసు ఉన్నతాధికారులు చెబుతున్నారు. సమాచారం సేకరిస్తున్నామని.. త్వరలో అన్ని ఆధారాలను సేకరించి కనుక్కుంటామని చెబుతున్నారు.

Next Story