ఒక్క ఫుడ్ ఆర్డర్ చేస్తే.. 42 ఆర్డర్లు వచ్చాయి
One order, many parcels.. ఒక్కోసారి చిన్న పొరపాటు కారణంగా షాక్ కు గురయ్యేలా చేస్తుంటుంది. ఫిలిప్పైన్స్‌కు చెందిన
By సుభాష్ Published on 4 Dec 2020 4:51 PM ISTఒక్కోసారి చిన్న పొరపాటు కారణంగా షాక్ కు గురయ్యేలా చేస్తుంటుంది. ఫిలిప్పైన్స్‌కు చెందిన ఏడేళ్ల బాలికకు షాకయ్యే అనుభవం ఎదురైంది. ఫిలిప్పైన్స్‌కు చెందిన ఏడేళ్ల బాలిక తన బామ్మకు తనకు కలిపి ఫ్రైడ్ చికెన్ రైస్‌ను ఆన్‌లైన్‌లో ఆర్డర్ చేసింది. అయితే ఫుడ్ ఆర్డర్ చేస్తుండగా, ఇంటర్నెట్ సమస్య ఎదురైంది. ఎంతకి ఫుడ్ బుక్ అయ్యే సమయంలో సమస్య తలెత్తుతూ వచ్చింది. నెట్ సరిగా లేని కారణంగా ఆ పాప గమనించుకోకుండా పదేపదే దానిపై క్లిక్ చేయడంతో ఒకే రకం ఫుడ్ 42 సార్లు ఆర్డర్ వెళ్లింది. అప్పటికే తాము ఆర్డర్ చేసిన ఆహారం ఎప్పుడు వస్తుందా.? అని ఎదురు చూస్తున్నవారికి నిమిషాల వ్యవధిలోనే సుమారు 42 ఫుడ్ డెలివరీలు వచ్చాయి.
ఆ వీధి మొత్తం డెలివరీ ఎగ్జిక్యూటివ్స్‌తో నిండిపోయింది. దాంతో ఆ చిన్నారికి, ఆ బామ్మకు ఏం చేయాలో అర్థం కాలేదు. ఫిలిఫ్పైన్స్ కరెన్సీలో 189 పీసోలు కావాల్సిన మొత్తం ఈ పొరపాటుతో 7,945 పీసోలుగా మారింది. అంత డబ్బు ఎలా చెల్లించాలో తెలియక వారు కంగారు పడ్డారు. దీంతో ఇరుగు పొరుగువారు వెంటనే స్పందించి ఆదుకున్నారు. వారు ఆ ఆర్డర్లను తీసుకుని డెలివరీ సంస్థకు డబ్బులు చెల్లించారు. దీంతో పాపతో పాటు బామ్మ ఊపిరి పీల్చుకున్నారు. ఈ విషయాన్ని ఓ నెటిజన్ ఫేస్ బుక్‌లో షేర్ చేశాడు. ఆన్‌లైన్ కంటే బయటే ఎక్కువ కొనుగోళ్లు జరిగాయంటూ ఆ నెటిజన్ చమత్కరించాడు.
�