రోజుకు ఒక్కసారైనా నవ్వాలి.. జపాన్‌లో వింత చట్టం

ఎక్కడైనా సరే నిందితులకు కఠిన శిక్షలు పడేందుకు కొత్త చట్టాలను రూపొందిస్తారు.

By Srikanth Gundamalla  Published on  12 July 2024 2:45 PM IST
new law,  japan, people laugh, every day,

రోజుకు ఒక్కసారైనా నవ్వాలి.. జపాన్‌లో వింత చట్టం

ఎక్కడైనా సరే నిందితులకు కఠిన శిక్షలు పడేందుకు కొత్త చట్టాలను రూపొందిస్తారు. తద్వారా బాధితులకు న్యాయం జరగాలని చూస్తారు. అంతేకాదు.. కఠినమైన చట్టాలు ఉంటే నేరాలు కూడా అదుపులో ఉంటాయి. ఈ మేరకు ప్రభుత్వాలు కొత్త చట్టాలను రూపొందిస్తూ ఉంటాయి. ఇటీవల ఇండియాలో కొత్త నేరాలు ఇలా అమలులోకి వచ్చిన విషయం తెలిసిందే. అయితే.. జపాన్‌ రూటే సపరేట్‌ అంటోంది అక్కడి ప్రభుత్వం. తాజాగా ఒక వింత చట్టాన్ని అమల్లోకి తీసుకొచ్చింది. ప్రతి రోజు అందరూ నవ్వాలంటూ కొత్త చట్టం తెస్తోంది. ఈ అంశం ప్రస్తుతం జపాన్‌లోనే కాదు.. వరల్డ్‌ వైడ్‌గా చర్చనీయాంశం అవుతోంది.

యమగట ప్రిఫెక్చర్ స్థానిక ప్రభుత్వం ఈ సంచలనాత్మక చట్టాన్ని ప్రవేశపెట్టింది. ప్రతిరోజు అందరూ నవ్వాలని కండీషన్ పెట్టింది. ఇలా చేయడం ద్వారా శారీరక, మానసిక ఆరోగ్యాన్ని పెంపొందించుకోవచ్చని పేర్కొంది. ఈ మేరకు శుక్రవారమే ఆదేశాలు జారీ చేసింది. నవ్వుతో కూడుకున్న వాతావరణాన్ని ప్రోత్సహించాలంటూ యమగట ప్రభుత్వం ఆయా కంపెనీలకు ఆదేశాలు జారీ చేసింది. ప్రతి నెలా ఎనిమిదో తేదీన ప్రత్యేకంగా హాస్యంతో ఆరోగ్యం కోసం కేటాయించాలంటూ సూచనలు చేసింది. కాగా.. ఇక్కడున్న యమగట విశ్వవిద్యాలయంలో ఫ్యాకల్టీ ఆఫ్ మెడిసిన్ పరిశోధనల నేపథ్యంలో చట్టాన్ని తీసుకొచ్చారు. తక్కువగా నవ్వే వాళ్లలో కొన్నిరకాల వ్యాధుల వల్ల మరణం ముప్పు పెరుగుతోందని గుర్తించారు. దీని ఆధారంగానే అక్కడి ప్రభుత్వం చట్టాన్ని తీసుకొచ్చింది. అయితే.. ఈ రూల్ పాటించని వారికి జరిమానా వంటివి ఏమీ విధంచరని తెలిసింది.

కాగా.. ఈ చట్టాన్ని పలువురు వ్యతిరేకిస్తున్నారు. ఇలాంటి చట్టాలే హాస్యాస్పదంగా ఉన్నాయని అంటున్నారు. కొందరు వ్యక్తిగత కారణాల చేత నవ్వకపోవచ్చని అబిప్రాయపడుతున్నారు. నవ్వడం అనేది స్వేచ్ఛ భావప్రకటనాలో భాగమని పేర్కొంటున్నారు. ఇలా నవ్వడం కోసం చట్టాలు తేవడమేంటో అంటున్నారు.

Next Story