పడవ ప్రమాదం, 63 మంది దుర్మరణం
పశ్చిమాఫ్రికాలోని కేప్ వేర్డేలో ఘోర ప్రమాదం సంభవించింది. ఈ దుర్ఘటనలో 63 మంది ప్రాణాలు కోల్పోయారు.
By Srikanth Gundamalla Published on 17 Aug 2023 12:41 PM GMTపడవ ప్రమాదం, 63 మంది దుర్మరణం
పశ్చిమాఫ్రికాలోని కేప్ వేర్డేలో ఘోర ప్రమాదం సంభవించింది. అక్కడి ద్వీప సమూహం తీరానికి దగ్గరలో వలసదారులతో వెళ్తున్న పడవ సముద్రంలో మునిగిపోయింది. ఈ దుర్ఘటనలో 63 మంది ప్రాణాలు కోల్పోయారు.
పశ్చిమ ఆఫ్రికాలోని కేప్ వెర్డెలో ఈ ఘటన చోటుచేసుకుందని అంతర్జాతీయ వలసల సంస్థ తెలిపింది. ప్రమాదంలో ఇప్పటి వరకు 38 మంది రక్షించినట్లు అధికారులు ప్రకటించారు. క్షేమంగా బయటపడిన వారిలో నలుగురు పిల్లలు ఉన్నట్లు ప్రకటించారు. ఫిషింగ్ బోట్ అట్లాంటిక్ మహాసముద్రంలో 150 నాటికల్ మైళ్ల దూరంలో అంటే.. కేప్ వెర్డే ద్వీపానికి 277 కిలోమీటర్ల దూరంలో ఆగస్టు 14న కనిపించిందని పోలీసులు ప్రకటించారు. పడవ మునిగిపోయిన ఘటనను స్పానిష్ ఫిషింగ్ ఓడ చూసిందని.. ఆ తర్వాత అది కేప్ వెరియన్ అధికారులకు సమాచారం ఇచ్చిందని చెబుతున్నారు.
అయితే.. ఈ ఘటనలో ఏడుగురి మృతదేహాలే లభ్యం అయ్యాయని.. 56 మంది గల్లంతు అయ్యారని ఐఓఎం అధికార ప్రతినిధి ఒకరు తెలిపారు. సాధారణంగా పడవ ప్రమాదం జరిగిన తర్వాత వ్యక్తులు తప్పిపోతే వారు చనిపోయినట్లు ప్రకటించబడుతుందని అధికారులు చెప్పారు. మరోవైపు ఈ పడవ సెనెగల్‌లోని ఫాస్సే బోయ్ నుంచి జూలై 10న బయల్దేరిందని అందులో 101 మంది ప్రయాణికులు ఉన్నారని సెనెగల్ విదేశాంగ మంత్రిత్వ శాఖ తెలిపింది. యూరోపియన్ యూనియన్‌కు గేట్‌వేలో వేల మంది శరణార్థులు, వలసదారులు చేపలు పట్టే చిన్న పడవలలో ఇలా స్పెయిన్‌కు వెళ్తారని తెలుస్తోంది. ప్రతి ఏడాది ఈ ప్రమాదకరమైన ప్రయాణం చేస్తూ ప్రాణాలను పణంగా పెడుతున్నారని అక్కడి అధికారులు చెబుతున్నారు.