షాకింగ్ ఘటన.. గాల్లో ఉన్న విమానంలో వ్యక్తి ఆత్మహత్యాయత్నం

ఓ వ్యక్తి ఎగురుతున్న విమానంలో ఆత్మహత్యాయత్నం చేశాడు.

By Srikanth Gundamalla  Published on  19 March 2024 12:20 PM IST
man, suicide attempt,  flight,

షాకింగ్ ఘటన.. గాల్లో ఉన్న విమానంలో వ్యక్తి ఆత్మహత్యాయత్నం 

కొందరు చిన్న సమస్యలకే కఠిన నిర్ణయాలు తీసుకుంటున్నారు. సమస్యకు పరిష్కారాన్ని వెతుక్కోవడం మాని జీవితాలను ముగిస్తున్నారు. అయితే.. తాజాగా ఓ వ్యక్తికి ఏం సమస్య వచ్చిందో తెలియదు కానీ గాల్లో ఎగురుతున్న విమానంలో ఆత్మహత్యాయత్నం చేశాడు. విషయం తెలుసుకున్న విమాన సిబ్బంది ఎమర్జెన్సీగా ల్యాండ్ చేశారు.

ఈ షాకింగ్ సంఘటన తైవాన్‌కు చెందిన ఇవా ఎయిర్‌లైన్స్‌ ఫ్లైట్‌లో చోటుచేసుకుంది. ఇవా ఎయిర్‌లైన్స్‌కు చెందిన బీఆర్ 67 విమానం గత శుక్రవారం బ్యాంకాక్‌ నుంచి లండన్‌కు బయల్దేరింది. ఇక విమానం టేకాఫ్‌ తీసుకున్న తర్వాత ఓ ప్రయాణికుడు బాత్రూమ్‌లోకి వెళ్లాడు. అయితే.. చాలా సమయం అవుతున్నా అతను బయటకు రాలేదు. దాంతో.. వెంటనే స్పందించిన విమాన సిబ్బంది రెస్ట్‌ రూమ్‌ వద్దకు వెళ్లారు. డోర్‌ తట్టి పిలవగా ఎలాంటి స్పందన లేదు. అనుమానంతో డోర్‌ను బలవంతంగా తెరిచారు. ఆ వ్యక్తి ఆత్మహత్యకు పాల్పడుండగా చూశారు. అతన్ని ఆపి అక్కడి నుంచి బయటకు తీసుకొచ్చారు. సదురు ప్రయాణికుడి మానసిక పరిస్థితి బాగోలేదని భావించిన విమాన సిబ్బంది లండన్‌కు వెళ్లాల్సిన విమానాన్ని దారి మళ్లించారు. హిత్రూ ఎయిర్‌పోర్టులో ఎమర్జెన్సీ ల్యాండ్ చేశారు. ఈ మేరకు వివరాలను సదురు విమానయాన సంస్థ వెల్లడించింది.

అక్కడి కాలమానం ప్రకారం శుక్రవారం రాత్రి 7.30 గంటలకు విమానం హిత్రూ ఎయిర్‌పోర్టులో ఎమర్జెన్సీగా ల్యాండ్ చేసినట్లు తెలిపారు. ఇక విమానం ల్యాండ్‌ అయ్యే సరికి వైద్యులు సిద్ధంగా ఉన్నారు. అతన్ని వెంటనే ఆస్పత్రికి తరలించినట్లు ఇవా ఎయిర్‌లైన్స్‌ తెలిపింది. ప్రయాణికుడికి సంబంధించిన వివరాలు, ఎందుకు అతను ఆత్మహత్య చేసుకోవాలని అనుకున్నాడనే విషయాలను వెల్లడించలేదు.

Next Story