జాహ్నవి కందుల మృతి కేసులో ఊడిన పోలీస్ అధికారి ఉద్యోగం
అమెరికాలో జాహ్నవి కందుల మృతి కేసులో పోలీసు అధికారిని ఉద్యోగం నుంచి తొలగించారు ఉన్నతాధికారులు.
By Srikanth Gundamalla Published on 18 July 2024 11:09 AM ISTజాహ్నవి కందుల మృతి కేసులో ఊడిన పోలీస్ అధికారి ఉద్యోగం
అమెరికాలో జాహ్నవి కందుల మృతి కేసులో పోలీసు అధికారిని ఉద్యోగం నుంచి తొలగించారు ఉన్నతాధికారులు. జాహ్ని కందుల మృతిని చులకన చేస్తూ మాట్లాడిన డేనియల్ అడెరెర్ అనే పోలీసు అధికారిని ఉద్యోగం నుంచి తీసేశారు. ఆయన మాటలు మనసును గాయపర్చేలా ఉన్నాయని సియాటెల్ పోలీసు డిపార్ట్‌మెంట్ చీఫ్ సూ రహర్ తెలిపారు.
ఏపీలోని కర్నూలు జిల్లాకు చెందిన కందుల జాహ్నవి 2023 జనవరిలో సియాటెల్‌లోని పోలీస్ పెట్రోలింగ్ వాహనం మృతిచెందింది. అయితే..ఈ క కేసు దర్యాప్తులో అధికారి డేనియల్ అడెరెర్ జాహ్నవి మరణంపట్ల చులకనగా మాట్లాడుతూ పగలబడి నవ్వాడు. అప్పట్లో దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ అయ్యింది. ఆమె ఓ సాధారణ వ్యక్తి.. ఈ మరణానికి విలువ లేదంటూ మాట్లాడటం కలకలం రేపింది. సదురు పోలీసు అధికారిపై చర్యలు తీసుకోవాలని భారత్ నుంచి పెద్ద ఎత్తున డిమాండ్ వచ్చింది. భారత ప్రభుత్వం కూడా ఈ ఇదే విషయాన్ని ప్రస్తావించింది. దాంతో.. అప్పట్లోనే డేనియల్‌ను సస్పెండ్ చేయగా.. తాజాగా అతనిపై తుది చర్యలు తీసుకుని పూర్తిగా ఉద్యోగం నుంచి తొలగించారు.
మరోవైపు జాహ్నవి మృతిపై డేనియల్ చేసిన వ్యాఖ్యలు మృతురాలి కుటుంబాన్ని తీవ్రంగా గాయపర్చాయని ఉన్నతాధికారులు తెలిపారు. వాటిని ఎవరూ చెరపలేరని వ్యాఖ్యానించారు. డేనియల్ చేసిన కామెంట్స్ సియాటెల్ పోలీస్ డిపార్ట్‌మెంట్‌కే మాయని మచ్చగా మిగిలాయన్నారు. ప్రజల విశ్వాసాన్ని చూరగొనడం పోలీసుల బాధ్యత అనీ.. ఆ మేరకు నడుచుకోవాలంటూ పోలీస్ ఉన్నతాధికారులు తెలిపారు.