హమాస్‌పై ఇజ్రాయెల్ పైచేయి..తిరిగి ఆధీనంలోకి గాజా ప్రాంతాలు

హమాస్‌పై ఇజ్రాయెల్‌ సైన్యం పైచేయి సాధిస్తోంది. హమాస్ ఆధీనంలో ఉన్న ప్రాంతాలను తమ ఆధీనంలోకి తీసుకుంటున్నారు.

By Srikanth Gundamalla  Published on  11 Oct 2023 12:30 PM IST
israel, hamas, war, recaptured gaza,

హమాస్‌పై ఇజ్రాయెల్ పైచేయి..తిరిగి ఆధీనంలోకి గాజా ప్రాంతాలు

ఇజ్రాయెల్‌పై హమాస్‌ యుద్ధం ప్రకటించిన విషయం తెలిసిందే. దారుణంగా దాడులకు పాల్పడుతోంది. ఈ యుద్ధంలో ఎంతో మంది ప్రాణాలు కోల్పోతున్నారు. ఐదు రోజులుగా యుద్ధం కొనసాగుతోంది. అక్టోబర్ 6న యుద్ధం ప్రారంభం అయ్యింది. హమాస్‌ దాడులను తప్పికొడతామని.. పైచేయి సాధిస్తామని ఇజ్రాయెల్ ప్రధాని చెప్పారు. అన్నట్లుగానే చేస్తోంది ఆ దేశ సైన్యం. క్రమంగా హమాస్‌పై ఇజ్రాయెల్‌ సైన్యం పైచేయి సాధిస్తోంది. హమాస్ ఆధీనంలో ఉన్న ప్రాంతాలను తమ ఆధీనంలోకి తీసుకుంటున్నారు. తాజాగా గాజా సరిహద్దులోని దక్షిణ ఇజ్రాయెల్‌ను హమాస్‌ ఉగ్రవాదుల నుంచి తిరిగి స్వాధీనం చేసుకున్నట్లు ఇజ్రాయెల్‌ రక్షణ శాఖ అధికారికంగా ప్రకటించింది. అంతేకాదు.. ఆ ప్రాంతంలోని అనేక ప్రదేశాలు, రహదారులను కూడా తమ నియంత్రణలోకి వచ్చినట్లు తెలిపింది.

ఇజ్రాయెల్‌పై పాలస్తీనా ఉగ్రవాద సంస్థ హమాస్‌ గత శనివారం మెరుపుదాడులకు దిగింది. దాంతో.. ఇజ్రాయెల్ కూడా తిరిగి యుద్ధం ప్రారంభించింది. ఈ దాడి, ప్రతిదాడుల్లో రెండు దేశాల భూభాగాలు దద్దరిల్లిపోతున్నాయి. ఇరు దేశాల్లోని వీధులు రక్తంతో తడిసిపోతున్నాయి. యుద్ధం జరిగిన ఈ ఐదు రోజుల్లోనే 3వేలకు పైగా మంది ప్రాణాలు కోల్పోయారు. ఎక్కడ చూసినా గట్టుగా శవాలు కనిపిస్తున్నాయి. భీకర పరిస్థితులు కనిపిస్తున్నాయి. గాయపడ్డవారి రోదనలు హృదయవిదారకంగా దర్శనమిస్తున్నాయి. దాడుల తర్వాత గాయడపడ్డ వారి వీడియోలు.. ధ్వంసమైన పలు ఇళ్లకు సంబంధించిన ఫొటోలు సోషల్‌ మీడియాలో కనిపిస్తున్నాయి. వాటిని చూసిన వారంతా అయ్యో అంటున్నారు.

హమాస్‌ దాడులను ఇజ్రాయెల్ దీటుగా ఎదుర్కొంటోంది. ఈ మేరకు వైమానిక దాడులను చేస్తోంది. హమాస్‌ బలగాలను ఇజ్రాయెల్ సైన్యం మట్టుబెట్టే పనిలో పడింది. కాగా.. ఇప్పటి వరకు తమ దాడిలో 1500 మంది హమాస్ మిలిటెంట్లు చనిపోయారని ఇజ్రాయెల్ తెలిఇంది. తమ భూబాంలో వివిధ ప్రాంతాల్లో వారి మృతదేహాలను గుర్తించినట్లు తెలిపింది. సరిహద్దుల్లోని తమ భూభాగాన్ని తిరిగి నియంత్రణలోకి తీసుకొస్తున్నట్లు ఇజ్రాయెల్ సైన్యం ప్రకటించింది. కాగా.. గాజా వైపు నుంచి సరిహద్దుల్లోకి ఎవరొచ్చిన కాల్చివేయాలంటూ ఇజ్రాయెల్ ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. దాంతో.. క్రమంగా హమాస్‌పై ఇజ్రాయెల్ సైన్యం పైచేయి సాధిస్తోంది.

Next Story