ఇంటర్నేషనల్ యోగా డే: అసలు యోగా ఎప్పుడు మొదలైంది.. లాభాలు ఏంటి?
యోగా చాలా పురాతనమైనది. వేదకాలం నుంచే యోగా ఉన్నట్లుగా చెబుతుంరుటా. 2500 ఏళ్ల క్రిందటే..
By Srikanth Gundamalla Published on 20 Jun 2023 2:00 PM ISTఇంటర్నేషనల్ యోగా డే: అసలు యోగా ఎప్పుడు మొదలైంది.. లాభాలు ఏంటి?
యోగా చాలా పురాతనమైనది. వేదకాలం నుంచే యోగా ఉన్నట్లుగా చెబుతుంటారు. 2500 ఏళ్ల క్రిందటే సాధవులు యోగా సాధనలు చేసేవారని యూనివర్సిటీ ఆఫ్ లండన్ పరిశోధకులు తెలిపారు. అప్పట్లో స్థిర భంగిమలో ఉంటూనే యోగా చేసేవారని చెబుతున్నారు. ఆరోగ్యాన్ని కాపాడుకునేందుకు ఆసనాలు వచ్చాయి. 1930వ సంవత్సరం నుంచే 'సూర్యనమస్కారం' ఆసనం ప్రాచుర్యంలోకి వచ్చినట్లు చరిత్ర పుస్తకాలను తిరగేస్తే తెలుస్తోంది. గడచిన శతాబ్ద కాలంలో యోగా కూడా అనేక రూపాల్లోకి వచ్చింది. విభిన్నమైన కొత్త ఆసనాలు ఆచరణలోకి వచ్చాయి. ఇప్పుడు మనం యోగా సెంటర్లలో చూస్తోన్న ఆసనాలు ఉండేవి కావని వివరిస్తున్నారు. కాల క్రమేణా యోగాకు ప్రాముఖ్యత పెరిగింది.
యోగా ప్రాముఖ్యత యావత్ ప్రపంచం గుర్తిస్తోంది. ప్రపంచ దేశాల ప్రజలు ఇప్పుడు యోగాను అభ్యసిస్తున్నారు. జిమ్, వర్కౌట్స్ కంటే యోగాసనాల ద్వారా మంచి ఆరోగ్యం లభిస్తుంది. దీంతో..జనాలు ఎక్కువగా యోగాసనాలపై దృష్టిసారిస్తున్నారు. ఈ నేపథ్యంలోనే యోగాకు అంతర్జాతీయ గుర్తింపు కూడా లభించింది. ప్రతి ఏటా జూన్ 21న యోగా దినోత్సవాన్ని నిర్వహిస్తున్నారు. యోగా మానసిక ప్రశాంతతను ఇవ్వడమే కాకుండా.. మనస్సును కూడా చురుకుగా చేస్తుంది. కొన్ని యోగాసనాలు రోజూ చేయడం వలన.. మానసిక ప్రశాంతతను పొందడమే కాకుండా, మెదడు పనితీరు కూడా మెరుగుపడుతుందని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు.
అంతర్జాతీయ యోగా దినోత్సవం ప్రతి ఏటా జూన్ 21న జరుపుకుంటారు. అనేక సంస్కృతులతో కూడిన భిన్నమైన ప్రజలను ఏకం చేయడంలో యోగా చక్కటి వేదికగా నిలుస్తుంది. 2014లో ఐక్యరాజ్య సమితి జనరల్ అసెంబ్లీలో ప్రధాని మోదీ.. అంతర్జాతీయ యోగా దినోత్సవ వేడుకను ప్రవేశపెట్టారు. అప్పటి నుంచి యోగా అవశ్యకత, సమతుల్యత, బలం, ఏకాగ్రత పెంచడంపై ప్రపంచవ్యాప్తంగా అత్యంత ప్రజాదారణ పొందిన కార్యక్రమంగా యోగా నిలిచింది. 2015 నుంచి జూన్ 21 నుంచి ప్రతి ఏడాది అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని నిర్వహిస్తున్నారు.
అంతర్జాతీయ యోగా దినోత్సవం 2023 థీమ్ యోగా ఫర్ హ్యుమానిటీ. దీని ప్రకారం యోగా వివిధ శైలులు శారీరక భంగిమలు, శ్వాస వ్యాయామాలు, ధ్యానం లేదా విశ్రాంతిని మిళితం చేస్తాయన్నమాట. శారీరక, మానసిక ఆరోగ్యానికి యోగా ప్రయోజనాలు చేకూరుస్తుంది. అంతేకాదు మానసిక ఒత్తిడి, ఆందోళనను, నిరాశను తగ్గించేందుకు సహాయపడుతుంది. రాత్రి వేళ సరిగ్గా నిద్రపట్టని వారికి కూడా యోగా ఎంతో ఉపయోగపడుతుంది. కండరాలను బలంగా చేయడంలోనూ యోగా దోహదపడుతుందని నిపుణులు చెబుతున్నారు. బరువుని తగ్గించి.. జీవ ప్రక్రియను మెరుగుపరచడం వంటి వాటికి యోగా ఉపయోగపడుతుంది.