మహిళ పట్ల రోబో అనుచిత ప్రవర్తన.. నెట్టింట వీడియో వైరల్

తాజాగా సౌదీ అరేబియాలో కూడా మొట్టమొదటి హ్యూమనాయిడ్ రోబోలను తయారు చేశారు.

By Srikanth Gundamalla  Published on  8 March 2024 10:57 AM IST
Inappropriate behavior,  humanoid robot,  woman,  saudi,

మహిళ పట్ల రోబో అనుచిత ప్రవర్తన.. నెట్టింట వీడియో వైరల్

రోజు రోజుకు ప్రపంచంలో టెక్నాలజీ పెరిగిపోతుంది. మానవుల స్థానంలో రోబోలను తీసుకొస్తున్నారు. ఇప్పటికే వచ్చి ఏఐ సంచలనంగా మారింది. ఇక రోబోను ఎప్పట్నుంచే తయారు చేస్తున్నారు సైంటిస్టులు. మానవులను రీప్లేస్ చేసేలా హ్యూమనాయిడ్‌ రోబోలను తయారు చేస్తున్నారు. తాజాగా సౌదీ అరేబియాలో కూడా మొట్టమొదటి హ్యూమనాయిడ్ రోబోలను తయారు చేశారు. ఈ మేరకు వాటిని ప్రదర్శనకు ఉంచారు.

ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్‌లో సౌదీ పురోతిని చాటిచెప్పాలనే ఉద్దేశంతో ఒక జాతీయ ప్రాజెక్టుగా తొలి హ్యుమనాయిడ్‌ రోబోను రూపొందించారు. ఈ హ్యూమనాయిడ్‌ రోబోను రియాద్‌లో మారచి 4వ తేదీన ఆవిష్కరించారు. ఈ సందర్భంగానే పలు స్థానిక మీడియా సంస్థల ప్రతినిధులు రోబో.. దాని పనితనం గురించి ప్రజలకు తెలిపేందుకు అక్కడకు వెళ్లారు. ఓ మహిళా రిపోర్టర్‌ మగ హ్యూమనాయిడ్‌ రోబో దగ్గర నిల్చుని దాని గురించి వివరిస్తుండగా.. ఆ రోబో అనుచితంగా ప్రవర్తించింది. మహిళా రిపోర్టర్‌ను అనుచితంగా తాకింది. ఇదంతా వీడియోలో రికార్డు అయ్యింది. అదే వీడియో సోషల్‌ మీడియాలో ప్రత్యక్షం అయ్యింది. వైరల్ అవుతోంది.

ఈ వీడియో చూసిన నెటిజన్లు భిన్న రకాలుగా స్పందిస్తున్నారు. సాంకేతికంగా రోబో విఫలమైందంటూ కామెంట్స్ చేస్తున్నారు. సాధారణ పని తీరుకు విరుద్ధంగా పనిచేస్తుందంటూ విమర్శలు చేస్తున్నారు. ఇంకొందరు నెటిజన్లు సాధారణ కదలికల్లో భాగంగానే రోబో చేతిని కదిలించిందంటూ.. దీన్ని తప్పుడు దోవకు తీసుకెళ్లొద్దంటూ మద్దతు తెలుపుతున్నారు.


Next Story