కరోనాతో మహాత్మాగాంధీ మునిమనవడు మృతి

Gandhi's great-grandson Satish Dhupelia dies of COVID-19.. కరోనా మహమ్మారి సామాన్యుడి నుంచి ప్రముఖల వరకు అందరిని బలి

By సుభాష్  Published on  23 Nov 2020 5:40 PM IST
కరోనాతో మహాత్మాగాంధీ మునిమనవడు మృతి

కరోనా మహమ్మారి సామాన్యుడి నుంచి ప్రముఖల వరకు అందరిని బలి తీసుకుంటుంది. దేశంలో కరోనా వ్యాపించి దాదాపు సంవత్సరం దగ్గర పడుతున్నా.. ఏ మాత్రం తగ్గడం లేదు. రోజురోజుకు ఎందరినో బలి తీసుకుంటోంది. తాజాగా మహాత్మ గాంధీ ముని మనవడు సతీష్‌ ధుపేలియా (66) కరోనాతో మరణించారు. దక్షిణాఫ్రియాలోని జొహన్నెస్‌బర్గ్‌ లో నివసించే ఆయన కొంత కాలంగా న్యూమోనియాతో సతమతమవుతున్నారు. నెల రోజులుగా ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న ఆయనకు ఇటీవల కరోనా సోకింది.

మూడు రోజుల కిందటే తన పుట్టిన జరుపుకొన్న సతీష్‌ ఆదివారం రాత్రి ఆకస్మికంగా గుండెపోటుతో తుది శ్వాస విడిచినట్లు ఆయన సోదరి ఉమా ధుపేలియా వెల్లడించారు. సతీష్‌ దక్షిణాఫ్రికాలో గాంధీ డెవలప్‌మెంట్‌ ట్రస్ట్‌ కార్యకలాపాలు నిర్వహించడంతో పాటు సామాజిక కార్యకలాపాల్లో చురుకుగా పాల్గొనే వారు. సతీష్‌ ధుపేలియా తన జీవితంలో అధిక శాతం మీడియా రంగంలోనే గడిపారు. వీడియో, ఫోటో గ్రాఫర్‌గా పని చేశారు.

Next Story