ఉద్యోగి తొలగింపు.. 'ఎక్స్'కు భారీ జరిమానా
ఎక్స్ అధినేత ఎలన్ మస్క్ ఈ సంస్థను సొంతం చేసుకున్న తర్వాత పలు సంచలన నిర్ణయాలు తీసుకున్న విషయం తెలిసిందే.
By Srikanth Gundamalla Published on 17 Aug 2024 1:51 AM GMTఉద్యోగి తొలగింపు.. 'ఎక్స్'కు భారీ జరిమానా
ఎక్స్ అధినేత ఎలన్ మస్క్ ఈ సంస్థను సొంతం చేసుకున్న తర్వాత పలు సంచలన నిర్ణయాలు తీసుకున్న విషయం తెలిసిందే. ముఖ్యంగా ఉద్యోగుల పనిసమయాలు పెంచడంతో పాటు కఠిన నిబంధనలు అమలు చేశారు. అలాగే కొందరిని ఉద్యోగాల నుంచి పీకేశారు కూడా. దాంతో.. ఉద్యోగులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. తాజాగా ఇదే ఎక్స్‌లో ఓ ఉద్యోగిని తమ ఈ-మెయిల్‌కు సమాధానం ఇవ్వలేదన్న కారణంతో విదుల నుంచి తొలగించారు. దాంతో.. ఎక్స్‌కు ఐర్లాండ్ వర్క్ ప్లేస్ కమిషన్ బిగ్ షాక్ ఇచ్చింది. ఆ ఉద్యోగికి పరిహారంగా భారీ మొత్తంలో చెల్లించాలంటూ ఆదేశాలు జారీ చేసింది. ఉన్నఫలంగా ఉద్యోగం నుంచి తీసేసినందుకు అతినికి 6,02,640 డాలర్లు అంటే మన ఇండియన్ కరెన్సీలో రూ.5 కోట్లను చెల్లించాలని ఆదేశించింది. ఐర్లాండ్‌లో ఇంత భారీ పరిహారాన్ని చెల్లించాంటూ ఆదేశాలు ఇవ్వడం ఇదే తొలిసారి కావడం గమనార్హం.
ఎలాన్ మస్క్ 2022 డిసెంబరులో ఉద్యోగులందరికీ ఓ ఈ-మెయిల్‌ను పంపించారు. అందులో ట్విటర్‌ని మెరుగుపరిచేందుకు ఉద్యోగులు అంకితభావం, సుదీర్ఘ పనిగంటలకు కట్టుబడి ఉండాలని సూచించారు. ఈ-మెయిల్‌కి చివరిలో అవును, కాదు అనే ఆప్షన్లు ఇచ్చి అభిప్రాయాలు తెలపాలని మెయిల్‌లో పేర్కొన్నారు. అంతేకాదు దీనికి ఎలాంటి సాధానం ఇవ్వకపోతే స్వచ్ఛందంగా ఉద్యోగం నుంచి వైదొలుగుతున్నట్లు పరిగణిస్తామంటూ ఎలాన్ మస్క్ షరతు పెట్టారు. ఈ సమాధానం ఇవ్వడానికి మూడు నెలల సమయం కూడా ఇచ్చారు. అయితే.. 2013 నుంచి డబ్లిన్ కార్యాలయంలో ఉద్యోగం చేస్తున్న గ్యారీ రూనీ అనే ఉద్యోగి ఎలాన్ మస్క్ ఈ-మెయిల్‌కు ఎలాంటి సమాధానం ఇవ్వలేదు. దాంతో కారణాలు తెలపకుండానే అతడిని ఉద్యోగం నుంచి తొలగించారు.
ఉద్యోగం పోవడంతో సదురు ఉద్యోగి డబ్ల్యూఆర్‌సీని ఆశ్రయించాడు. విచారణ జరిపిన కమిషన్ తాజాగా 73 పేజీల తీర్పు వెలువడింది. అందులో ‘అవును’ అని క్లిక్ చేయకపోవడాన్ని రాజీనామాగా పరిగణించలేమని న్యాయాధికారి మైఖేల్ మాక్‌నామీ పేర్కొన్నారు. అదేవిధంగా రూనీ ఆకస్మిక తొలగింపుతో ఇబ్బందులు పడ్డాడనీ పేర్కొంది. ఈ క్రమంలో ఆర్థికంగా, వృత్తిపరంగా ఎదుర్కొన్న ఇబ్బందులకుగాను పరిహారంగా అతడికి రూ.5కోట్లు చెల్లించాలని డీబ్ల్యూఆర్‌సీ తీర్పును వెల్లడించింది.