సరిహద్దులో మహిళా స్మగ్లర్లను కట్టడి చేయడానికి భారత సైన్యం సరికొత్త ప్రణాళిక

BSF Deploys female constables at Indo Bangla Border.భారతదేశం-బంగ్లాదేశ్ సరిహద్దులో పెట్రోలింగ్‌ను పెంచింది

By M.S.R  Published on  2 Jan 2022 8:30 AM GMT
సరిహద్దులో మహిళా స్మగ్లర్లను కట్టడి చేయడానికి భారత సైన్యం సరికొత్త ప్రణాళిక

భారతదేశం-బంగ్లాదేశ్ సరిహద్దులో పెట్రోలింగ్‌ను పెంచింది బీఎస్ఎఫ్. సరిహద్దు దాటి భారత్‌లోకి స్మగ్లింగ్‌లో పాల్గొంటున్నట్లు అనుమానిస్తున్న మహిళలను తనిఖీ చేయడానికి మహిళా కానిస్టేబుళ్లను నియమించినట్లు సరిహద్దు భద్రతా దళ అధికారి తెలిపారు.

"భారతదేశం-బంగ్లాదేశ్ సరిహద్దు యొక్క ప్రారంభ స్థానం. సరిహద్దుకు ఆ వైపున ఒక గ్రామం ఉంది, అది కొంతవరకు భారతదేశానికి చెందినది. ఆ గ్రామంలో సుమారు 56 మంది మహిళలు నివసిస్తున్నారు. భారతదేశం-బంగ్లాదేశ్‌ మధ్య ప్రయాణిస్తున్న వాళ్ళను చెక్ చేయడానికి మహిళా కానిస్టేబుళ్లను మోహరించారు, "అని BSF కానిస్టేబుల్ సుహాసిని పుహాన్ చెప్పారు. "గ్రామానికి కొన్ని మీటర్ల దూరంలో బంగ్లాదేశ్ ప్రారంభమవుతుంది. కొంతమంది గ్రామస్తులు చట్టవిరుద్ధమైన కార్యకలాపాలకు పాల్పడుతున్నారు, దాని కారణంగా మన దేశం నష్టపోతుంది. ఆ గ్రామంలోని మహిళలు భారతదేశంలోకి అక్రమంగా రవాణా చేయకుండా చూసేందుకు, మేము వారిని తనిఖీ చేస్తాము" అని పుహాన్ చెప్పారు. "అధికారులు సోదాలు చేయడానికి గ్రామంలోకి వెళ్ళినప్పుడు మేము కూడా వారితో వస్తాము" అని ఆమె తెలిపారు.

భారతదేశం-బంగ్లాదేశ్ సరిహద్దు వెంబడి ఉన్న హరిదాస్‌పూర్-జయంతీపూర్ బోర్డర్ ఔట్‌పోస్ట్‌లో, యూనిట్‌లో దాదాపు 36 మంది మహిళా కానిస్టేబుళ్లను నియమించారు. ఈ సరిహద్దులో కొన్ని ప్రాంతాలకు ఇప్పటికీ కంచెలేకుండా ఉండడంతో పెట్రోలింగ్ చేయడం చాలా ఆందోళన కలిగిస్తోంది. ఈ సరిహద్దులో కొంత ప్రాంతం ఇప్పటికీ కంచె వేయలేదు. ఫెన్సింగ్‌ పూర్తయితే స్మగ్లింగ్‌ నుంచి కొంత ఉపశమనం లభిస్తుంది. స్మగ్లర్లు ఎక్కువగా రాత్రిపూట సరిహద్దును దాటడానికి ప్రయత్నిస్తున్నారు.

Next Story