ఆ పెళ్లిని క‌రోనా వైర‌స్ కూడా అడ్డుకోలేక‌పోయింది

Bride Tests Positive ... క‌రోనా వైర‌స్ ప్ర‌పంచాన్నే వ‌ణికిస్తోంది. ఈ మ‌హ‌మ్మారి కార‌ణంగా ఘ‌నంగా పెళ్లిళ్లు కూడా చేసుకో

By సుభాష్  Published on  5 Dec 2020 12:23 PM IST
ఆ పెళ్లిని క‌రోనా వైర‌స్ కూడా అడ్డుకోలేక‌పోయింది

క‌రోనా వైర‌స్ ప్ర‌పంచాన్నే వ‌ణికిస్తోంది. ఈ మ‌హ‌మ్మారి కార‌ణంగా ఘ‌నంగా పెళ్లిళ్లు కూడా చేసుకోలేక‌పోతున్నారు. త‌క్కువ మందితో భౌతిక దూరం పాటిస్తూ చేసుకుంటున్నారు. ఇటీవ‌ల కాలంలో వ‌ధువుకు లేదా వ‌రుడికి క‌రోనా పాజిటివ్ అని తెలియ‌గానే ఆగిపోయిన పెళ్లిళ్లు ఎన్నో ఉన్నాయి. అయితే.. ఓ జంట మాత్రం క‌రోనాకు బెద‌ర‌లేదు. వధువుకు కరోనా సోకినప్పటికీ పెళ్లి తంతును ఆపలేదు. భౌతిక దూరం పాటిస్తూనే ఇద్దరూ మనువాడారు.

బ్రిట‌న్ దేశానికి చెందిన లారెన్, పాట్రిక్ డెల్గడో జంట నాలుగేళ్లుగా ప్రేమించుకుంటున్నారు. గత ఏడాది మేలో వారికి ఎంగేజ్‌మెంట్ కూడా జరిగింది. అప్ప‌టి నుంచి పెళ్లి కోసం తెగ క‌ల‌లు కంటోంది ఆ జంట‌. చివరికి ఆ తేదీ రానే వచ్చింది. అయితే.. అంత‌లో వారికి అనుకోని షాక్ త‌గిలింది. సరిగ్గా పెళ్లికి ఐదు రోజుల ముందు వ‌ధువుకు క‌రోనా పాజిటివ్ అని తేలింది. దీంతో ఏం చేయాలో వారికి అర్థం కాలేదు. పెళ్లి కోసం తీసుకున్న పర్మిషన్ గడువు ముగిస్తే మళ్లీ దొరకడం కష్టం కావడంతో కరోనా ఉన్నప్పటికీ పెళ్లి తంతు పూర్తి చేయాలని నిశ్చయించుకున్నారు.

వధువు ఇంట్లోనే వివాహా కార్యక్రమాన్ని ఎలాంటి అవాంతరం లేకుండా సాఫీగా పూర్తి చేశారు. ఫస్ట్‌ ఫ్లోర్‌లో గల రూమ్ కిటకీ వద్ద వధువు ఇంటి ముందు గ్రౌండ్‌లో వరుడు ఉన్నారు. ఇద్దరూ ఒక రిబ్బన్ సహాయంతో ఉంగరాలను మార్చుకున్నారు. ఇలా వారి సంప్రదాయం ప్రకారం వివాహ తంతును పూర్తి చేశారు. దీంతో వారిద్ద‌రి ఆనందానికి అవ‌ధులు లేకుండా పోయాయి. ప్ర‌స్తుతం వీరి పెళ్లికి సంబంధించిన ఫోటోలు సోష‌ల్ మీడియాలో వైర‌ల్‌గా మారాయి.

Next Story