ఈ పావురం ధర వింటే ఆశ్చర్య పోవడం మీ వంతు..?
Belgian Pigeon Prace.. కొంత మంది పావురాలను పెంచుకోవడం కోసం కొనుగోలు చేస్తారు. మరికొందరు పావురాల పందే
By సుభాష్ Published on 16 Nov 2020 6:20 AM GMTఈ పావురం ధర వింటే ఆశ్చర్య పోవడం మీ వంతు..?కొంత మంది పావురాలను పెంచుకోవడం కోసం కొనుగోలు చేస్తారు. మరికొందరు పావురాల పందేల కోసం కొంటారు. కోడి, గుర్రెం పందేలలాగే ప్రపంచంలో చాలా చోట్ల పావురాలతో పందేలు నిర్వహిస్తుంటారు. అయితే.. ఈ విషయం చాలా మంది తెలియదు. పందెల్లో పాల్గొనేవారు ఉత్తమ జాతి పావురాలను ఎంచుకుంటారు. వాటి కొనుగోలుకు ఎంత ఖర్చయినా వెనకడుగు వేయరు. ఎందుకంటే ఇది పరువుకు సంబంధించిన అంశం.
ఓ పావురాన్ని ఏకంగా 14 కోట్ల రూపాయలకు కొన్నాడు ఓ వ్యక్తి. పావురానికి 14 కోట్లు ఏంటని మీరు షాక్ అవుతూ ఉన్నారా..? అది నిజంగా నిజం. బెల్జియంలో రేసింగ్ పావురాలను వేలంలో విక్రయిస్తుంటారు. న్యూకిమ్ అనే రేసింగ్ పావురం వేలంలో 2.6 మిలియన్ డాలర్లకు అమ్ముడైంది. అంటే మన కరెన్సీలో రూ.14 కోట్లకు పైమాటే. పిపా అనే సంస్థ.. ఈ పావురాన్ని వేలం వేసింది. రెండు వారలపాటు వేలం నిర్వహించారు. చివరి రోజైన ఆదివారం రోజున జరిగిన వేలంలో చైనాకు చెందిన ఈ న్యూకిమ్ అనే ఆడపావురాన్ని వేలం వేశారు. మరో అరగంటలో వేలం ముగుస్తుందనగా ఈ పావురం 2.6 మిలియన్ డాలర్లకు అమ్ముడు కావడం విశేషం. ఓ పావురం ఇన్ని కోట్లకు అమ్ముడుపోవడం ప్రపంచ రికార్డని చెబుతున్నారు.
రెండేళ్ల వయసున్న 'న్యూ కిమ్'ను 200 యూరోల బేస్ ప్రైస్‌తో వేలానికి పెట్టగా ఏకంగా 1.6 మిలియన్ యూరోలకు అమ్ముడుపోయింది. తనకు తెలిసినంత వరకు ఇది ప్రపంచ రికార్డు అని, ఇంత ధరకు పావురం అమ్ముడైన దాఖలాలు లేవని పిజన్ ప్యారడైజ్ చైర్మన్ నికోలస్ గైసెల్బ్రెచ్ట్ అన్నారు.