బంగ్లాలో ఇంకా ఉద్రిక్తతలు.. భారత సరిహద్దుకు బాధితులు

బంగ్లాదేశ్‌లో గత కొన్నాళ్లుగా రిజర్వేషన్ల కోసం ఆందోళనలు జరుగుతూనే ఉన్నాయి.

By Srikanth Gundamalla  Published on  8 Aug 2024 8:00 AM IST
Bangladesh nationals,   India border, bsf,

బంగ్లాలో ఇంకా ఉద్రిక్తతలే.. భారత సరిహద్దుకు బాధితులు

బంగ్లాదేశ్‌లో గత కొన్నాళ్లుగా రిజర్వేషన్ల కోసం ఆందోళనలు జరుగుతూనే ఉన్నాయి. ఇటీవల షేక్‌ హసీనా తన ప్రధాని పదవికి రాజీనామా చేశారు. ఆ తర్వాత దేశ రాజకీయాల్లో మరిన్ని మార్పులు వచ్చాయి. ఇప్పటికే రిజర్వేషన్ల కోసం జరిగిన ఆందో ళనల్లో ఎంతో మంది చనిపోయారు. షేక్ హసీనా రాజీనామా చేసి వెళ్లిపోయినా కూడా అక్కడ ఆందోళనలు కొనసాగుతున్నాయి. శాంతిభద్రతలు ఇంకా అదుపులోకి రాలేదని తెలుస్తోంది. కొన్ని వర్గాలకు చెందిన సంస్థలు, వ్యాపార సముదాయాలపై దాడులు జరుగుతూనే ఉన్నాయి. ఈ నేపథ్యంలో ఆశ్రయం కల్పించాలని కోసం బంగ్లాదేశీయులు భారత సరిహద్దులకు చేరుకుంటున్నారు. ముఖ్యంగా పశ్చిమ బెంగాల్‌లోని జల్‌పాయిగుడీ జిల్లాలో ఉన్న అంతర్జాతీయ సరిహద్దుకి వందల మంది బంగ్లా దేశీయులు వచ్చినట్లు తెలిసింది.

బంగ్లాదేశ్‌లోని పలు జిల్లాలు బెంగాల్‌లోని జల్‌పాయిగుడీ సరిహద్దులోనే ఉంటాయి. తమ దేశంలో దాడలు జరుగుతున్న నేపథ్యంలో వందల మంది బంగ్లాదేశ్‌కు చెందిన ప్రజలు జల్‌పాయిగుడీలోని దక్షిణ్‌ బెరూబారీ గ్రామంలో ఉన్న ఔట్‌పోస్టుకు చేరుకుంటున్నారు. ఇనుప కంచె వద్దకు వచ్చిన వారంతా తమ దేశంలో నెలకొన్న భయానక పరిస్థితులను వివరించారనీ.. తమకు భారత్‌లో ఆశ్రయం కల్పించాలని వేడుకుంటున్నారని స్థానికులు చెబుతున్నారు. అయితే.. భారత్‌ సరహద్దు మొత్తం మూసివేసిఉండటంతో వారు భారత్‌లోకి ప్రవేశించలేరని బీఎస్‌ఎఫ్ దళాలు చెప్పాయి. దళాలు బంగ్లాదేశీయులను వెనక్కి తీసుకెళ్లినట్లు తెలిసింది.

బంగ్లాదేశ్‌లో ఆందోళనలు.. హింసాత్మక సంఘటనల నేపథ్యంలో భారత ప్రభుత్వం అలర్ట్ అయ్యింది. సరిహద్దుల వెంబడి బీఎస్‌ఎఫ్‌తో పటిష్ట చర్యలను చేపట్టింది. క్షేత్ర స్థాయిలో కమాండర్లు పరిస్థితులను పర్యవేక్షిస్తున్నారు. బీఎస్‌ఎఫ్‌ డీజీ దల్జీత్‌ సింగ్ చౌదరి కైడా సరిహద్దుల్లోని జిల్లాలకు చేరుకుని అధికారులుతో సమావేశం అయ్యారు.


Next Story