Bangladesh: హిందూ టీచర్లే టార్గెట్.. బలవంతంగా రాజీనామాలు

బంగ్లాదేశ్‌లో రిజర్వేషన్లపై ఆందోళనలు జరిగిన విషయం తెలిసిందే.

By Srikanth Gundamalla  Published on  2 Sep 2024 1:23 AM GMT
Bangladesh: హిందూ టీచర్లే టార్గెట్.. బలవంతంగా రాజీనామాలు

బంగ్లాదేశ్‌లో రిజర్వేషన్లపై ఆందోళనలు జరిగిన విషయం తెలిసిందే. కొన్నాళ్లుగా అక్కడ ఉద్రిక్త పరిస్థితులు కొనసాగుతూనే ఉన్నాయి. ఆందోళనలు హింసగా మారడంతో చాలా మంది ప్రాణాలు కోల్పోయారు. ఆ తర్వాత ఆ దేశ ప్రధాని షేక్ హసీనా పదవికి రాజీనామాచేసి వెళ్లిపోయారు. కూడా యూనస్‌ నాయకత్వంలో కొత్త తాత్కాలిక ప్రభుత్వం ఏర్పడిన అక్కడ ఇంకా ఏదో ఒక చోట పలువురిపై దాడులు.. హింస కొనసాగుతూనే ఉంది. ఒక్కప్పుడు అల్లర్లతో అట్టుడిక బంగ్లాలో అల్లరి మూకలు ఇప్పుడు హిందూ టీచర్లే లక్ష్యంగా చేసుకుని వారితో బలవంతంగా రాజీనామాలు చేయిస్తున్నారు.

బంగ్లాదేశ్‌లో ఇప్పటికే దాఆపు 50 మంది వరకు హిందూ ఉపాధ్యాయులతో రాజీనామా చేయించినట్లు తెలుస్తోంది. నిజానికి ఈ సంఖ్య మరింత ఎక్కువగానే ఉండొచ్చని చెబుతున్నారు. ఆగస్టు 29వ తేదీన కొందరు విద్యార్థులు, ఇతర నిరసనకారులతో కలిసి బరిషల్‌లోని బాకర్‌గంజ్ ప్రభుత్వ కాలేజీకి దూసుకెళ్లారు. ఆ కాలేజీ ప్రిన్సిపాల్ శుక్లరాణి హైదర్‌తో వాగ్వాదానికి దిగారు. ఆమె రాజీనామా చేయాలంటూ డిమాండ్ చేశారు. లేదంటే తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సి ఉంటుందంటూ హెచ్చరించారు. చివరకు ఆమెతో బలవంతంగానే ఖాళీ పేపర్‌ పై నేను రాజీనామా చేస్తున్నా.. అని రాసిచ్చి వెళ్లిపోయేలా చేశారు. ఆగస్టు 18వ తేదీన కూడా 50 మంది విద్యార్థులు అజీంపూర్‌ ప్రభుత్వ బాలికల స్కూల్‌, కాలేజీలోకి చొరబడి ప్రిన్సిపాల్‌ గీతాంజలి బారువా, అసిస్టెంట్‌ హెడ్‌ టీచర్‌ గౌతమ్‌ చంద్రపాల్‌, ఫిజికల్‌ ఎడ్యుకేషన్‌ టీచర్‌ షహనాజా అక్తర్‌తో రాజీనామా చేయించారు. బంగ్లాదేశ్‌లో ఇలా చాలా చోట్ల హిందూ టీచర్లతో రాజీనామా చేయిస్తున్నారు. దాంతో.. ఆ వర్గానికిచెందిన వారిలో ఆందోళన ఇంకా కొనసాగుతూనే ఉంది. ప్రభుత్వం తమకు సాయం చేయాలని కోరుతున్నారు.

Next Story