ఆస్ట్రేలియాలో కుప్పకూలిన ఆర్మీ హెలికాప్టర్

క్వీన్స్‌లాండ్‌లో సైనిక విన్యాసాలు జరుగుతున్నాయి. ఈ విన్యాసాల్లోనే ఆర్మీ హెలికాప్టర్‌ కుప్పకూలింది.

By Srikanth Gundamalla  Published on  29 July 2023 8:45 AM IST
Australia, Army Helicopter, Collapse, Four Missing ,

 ఆస్ట్రేలియాలో కుప్పకూలిన ఆర్మీ హెలికాప్టర్

ఆస్ట్రేలియాలో ప్రమాదం చోటుచేసుకుంది. క్వీన్స్‌లాండ్‌లో సైనిక విన్యాసాలు జరుగుతున్నాయి. ఈ విన్యాసాల్లోనే ఆర్మీ హెలికాప్టర్‌ కుప్పకూలింది. హామిల్టన్ ద్వీపంలో ఓ మిలటరీ హెలికాప్టర్‌ కుప్పకూలింది. ఈ ఘటనలో హెలికాప్టర్‌లో ఉన్న నలుగురు సిబ్బంది గల్లంతు అయ్యారు. శుక్రవారం అర్ధరాత్రి ఎంఆర్‌హెచ్‌-90 తైపాన్ అనే ఆర్మీ హెలికాప్టర్‌ నీటిలో మునిగిపోయింది. ఈ విషయం స్వయంగా రక్షణ శాఖ బమంత్రి రిచర్డ్‌ మార్లెస్‌ తెలిపారు. అయితే.. ఆర్మీ హెలికాప్టర్‌లో ప్రమాద సమయంలో ఉన్ననలుగురు ఆచూకీ తెలియడం లేదని.. వారి కోసం గాలిస్తున్నట్లు అధికారులు తెలిపారు. ఇక నలుగురు గల్లంతైన విషయాన్ని కూడా వారి కుటుంబ సభ్యులకు చెప్పినట్లు తెలిపారు. గల్లంతైన వారి కోసం తీవ్రంగా గాలిస్తున్నట్లు అధికారులు చెప్పారు.

కాగా.. ఆస్ట్రేలియాలోని క్వీన్స్‌లాండ్‌లో రెండు వారాలుగా సైనిక విన్యాసాలు కొనసాగుతున్నాయి. ఇందులో జపాన్, ఫ్రాన్స్, జర్మనీ, దక్షిణ కొరియా దేశాలు కూడా పాల్గొంటున్నాయి. చైనా నుంచి ముప్పు పొంచి ఉండటంతో ఆస్ట్రేలియా తన సాయుధ బలగాల సామర్థ్యాన్ని పెంచుకుంటోంది. ఇందులో భాగంగానే మిత్ర దేశాలతో కలిసి తరచూ సైనిక విన్యాసాలు నిర్వహిస్తోంది ఆస్ట్రేలియా. ఈ క్రమంలోనే అనుకోకుండా అపశృతి చోటుచేసుకుంది.


Next Story