పోటీ నుంచి తప్పుకున్న బైడెన్‌ పదవికి రాజీనామా చేయాలి: రిపబ్లికన్ పార్టీ

అమెరికా అధ్యక్ష ఎన్నికల నుంచి ప్రస్తుత ప్రెసిడెంట్‌ జో బైడెన్ తప్పుకున్నారు.

By Srikanth Gundamalla  Published on  22 July 2024 3:15 AM GMT
America election, biden,  republican party,

పోటీ నుంచి తప్పుకున్న బైడెన్‌ పదవికి రాజీనామా చేయాలి: రిపబ్లికన్ పార్టీ

అమెరికా అధ్యక్ష ఎన్నికల నుంచి ప్రస్తుత ప్రెసిడెంట్‌ జో బైడెన్ తప్పుకున్నారు. ఈమేరకు స్వయంగా ఆయనే అధికారికంగా ప్రకటన చేశారు. అయితే.. ఎన్నికల నుంచి అధ్యక్షుడు బైడెన్ తప్పుకోవడంతో రిపబ్లికన్ పార్టీ అధ్యక్ష అభ్యర్థి డొనాల్డ్ ట్రంప్‌ ఆయనపై విమర్శలు చేశారు. ఈ మేరకు ఎక్స్‌ వేదికగా పోస్టు పెట్టారు. అధ్యక్ష పదవికి పోటీ పడే అర్హత బైడెన్‌కు లేదని ట్రంప్ అభిప్రాయపడ్డారు. అధ్యక్షుడిగా అమెరికాకు సేవలు అందించేందుకు బైడెన్‌ ఫిట్‌ కాదనే అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు డొనాల్డ్ ట్రంప్.

డొనాల్డ్ ట్రంప్‌ ఎక్స్‌ వేదికగా స్పందిస్తూ.. ‘బైడెన్ అధ్యక్ష పదవి కారణంగా మనం చాలా నష్టపోతాం. అయితే బైడెన్ కలిగించిన నష్టాన్ని మేము త్వరగా పూడ్చుతాము’ అని చెప్పారు. రిపబ్లికన్ పార్టీకి చెందిన మరో అగ్రనేత మైక్ జాన్సన్‌ కూడా ఇదే అభిప్రాయం వ్యక్తం చేశారు. డెమొక్రాటిక్ పార్టీ అధ్యక్ష అభ్యర్థిగా బైడెన్ పనికిరారని, అధ్యక్ష పదవికి కూడా రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. ఇక రిపబ్లికన్ పార్టీ ఉపాధ్యక్ష అభ్యర్థి జేడీ వాన్స్ ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు. అధ్యక్ష ఎన్నికల రేసు నుంచి తప్పుకుంటే.. జో బైడెన్ అధ్యక్షుడిగా కొనసాగడాన్ని ఎలా సమర్థించుకుంటారని ప్రశ్నించారు.

మరోవైపు బైడెన్ పోటీ నుంచి తప్పుకోవడంతో కమలా హారిస్‌ అధ్యక్ష రేసులో ఉండటం దాదాపుగా ఖరారు అయ్యింది. ఈ క్రమంలో ట్రంప్ గెలుపు కోసం రిపబ్లికన్ పార్టీ ఎలాంటి వ్యూహాలను సిద్ధం చేస్తుందో చూడాలి. అధ్యక్ష బరిలో నుంచి బైడెన్ తప్పుకోవడంతో ఎన్నికలు మరింత ఆసక్తికరంగా మారాయి. గా కమలా హారిస్‌ను ఎదుర్కొనే విషయంలో తాము ఎలాంటి ఆందోళన చెందడం లేదని రిపబ్లికన్ నేతలు చెబుతున్నారు.

Next Story