మూడువేల లీటర్ల మద్యాన్ని కాలువలో పారబోశారు
Afghan agents pour 3000 litres of liquor into Kabul canal.ఆఫ్ఘన్ ఇంటెలిజెన్స్ ఏజెంట్ల బృందం కాబూల్‌లోని ఒక కాలువలో
By M.S.R Published on 3 Jan 2022 12:09 PM ISTఆఫ్ఘన్ ఇంటెలిజెన్స్ ఏజెంట్ల బృందం కాబూల్‌లోని ఒక కాలువలో సుమారు 3,000 లీటర్ల మద్యాన్ని పారబోసింది. కొత్త తాలిబాన్ అధికారులు మద్యం అమ్మకాలను అరికట్టడానికి చర్యలు తీసుకుంది. జనరల్ డైరెక్టరేట్ ఆఫ్ ఇంటెలిజెన్స్ (జిడిఐ) విడుదల చేసిన వీడియో ఫుటేజీ ప్రకారం బ్యారెళ్లలో నిల్వ చేసిన మద్యాన్ని స్వాధీనం చేసుకున్న అధికారులు దాన్ని కాలువలోకి పారబోయడం చూడొచ్చు.
"ముస్లింలు మద్యం తయారు చేయడం, పంపిణీ చేయడం నుండి దూరంగా ఉండాలి" అని ఒక మత పెద్ద ఆదివారం ట్విట్టర్‌లో ఏజెన్సీ పోస్ట్ చేసిన ఫుటేజీలో తెలిపారు. ఈ దాడి ఎప్పుడు నిర్వహించబడింది, మద్యం ఎప్పుడు ధ్వంసం చేయబడింది అనేది స్పష్టంగా తెలియలేదు, అయితే ఈ ఆపరేషన్ సమయంలో ముగ్గురు డీలర్లను అరెస్టు చేసినట్లు ఏజెన్సీ విడుదల చేసిన ప్రకటన తెలిపింది.
د ا.ا.ا د استخباراتو لوی ریاست ځانګړې عملیاتي قطعې د یو لړ مؤثقو کشفي معلومات پر اساس د کابل ښار کارته چهار سیمه کې درې تنه شراب پلورونکي له شاوخوا درې زره لېتره شرابو/الکولو سره یو ځای ونیول.
— د استخباراتو لوی ریاست-GDI (@GDI1415) January 1, 2022
نیول شوي شراب له منځه یوړل شول او شراب پلورونکي عدلي او قضايي ارګانونو ته وسپارل شول. pic.twitter.com/qD7D5ZIsuL
గత పాలనలో కూడా మద్యం అమ్మడం మరియు సేవించడం నిషేధించబడింది, ఇక తాలిబాన్‌లు వచ్చాక కూడా మద్యం అమ్మకాలపై కఠిన నిర్ణయాలు తీసుకున్నారు. ఆగస్టు 15న తాలిబాన్లు అధికారాన్ని చేజిక్కించుకున్నప్పటి నుంచి దేశవ్యాప్తంగా మాదకద్రవ్యాలకు బానిసలైన వారిపై దాడులు ఎక్కువయ్యాయి.