అంత అవసరమా, ఆ డ్రెస్ ఏంటి ?!
By Nellutla Kavitha Published on 5 March 2022 12:38 PM ISTమహిళా క్రికెట్ ప్రపంచ కప్ పోటీలు నిన్న న్యూజిలాండ్ లో ప్రారంభమయ్యాయి. మార్చి 4 నుంచి ఏప్రిల్ 3 వరకు జరుగనున్నాయి. పోటీల్లో భాగంగా మొదటి మ్యాచ్ న్యూజిలాండ్ - వెస్టిండీస్ మధ్య జరిగితే, విండీస్ మహిళలు 3 పరుగుల తేడాతో విజయం సాధించారు. ఇక ఈ మ్యాచ్ లో ప్రధాన ఆకర్షణగా నిలిచాకు టీవీ ప్రజెంటర్ సంజనా గణేశన్, ఇంగ్లాండ్ క్రికెట్ టీం మాజీ కెప్టెన్ నాసిర్ హుస్సేన్. పూణే కు చెందిన 29 ఏళ్ల మోడల్, స్పోర్ట్స్ ఆంకర్, ఫాస్ట్ బౌలర్ బుమ్రా భార్య అయిన సంజనా ఈ పోటీ కామెంట్‌రీ కోసం వేసుకున్న డ్రెస్ ఆకర్షణగా, వివాదాలకు కేంద్రంగా మారింది. ఉక్రెయిన్ దేశ జెండాను సూచిస్తున్నట్టున్నగా నీలం, పసుపుతో కూడిన డ్రెస్ వేసుకుంది సంజన. మరోవైపు నాసిర్ హుస్సేన్ ని సడెన్గా చూస్తే పుతిన్ లా కనిపించడంతో సోషల్ మీడియాలో వీరి ఫోటో వైరల్ అయింది. ప్రస్తుతం రష్యా-ఉక్రెయిన్ మధ్య జరుగుతున్న యుధ్దంలో భారత్ తటస్థంగా ఉన్న నేపథ్యంలో అంతర్జాతీయ పోటీల్లో భారత కామెంటేటర్ ఉక్రెయిన్ జెండాను రిప్రజెంట్ చేసే డ్రెస్ వేసుకోవడమేంటనే విమర్శలు వినిపిస్తున్నాయి. మరోవైపు పుతిన్ లా అనిపిస్తున్న నాసిర్ గురించి కామెంట్లు చేస్తున్నారు నెటిజన్లు. ఇక మార్చ్ 6న భారత్, పాకిస్థాన్ మహిళల మ్యాచ్ జరుగనుంది.