కొలరాడో: బ్రెకెన్‌రిడ్జ్‌లో 30వ ఇంటర్నేషనల్‌ స్నో స్క్లప్చర్‌ కార్యక్రమం జరిగింది. అయితే ఈ ఏడాది ఇందులో 12 జట్లు పాల్గొననగా అందులో భారత్‌ కూడా ఒకటి. ఈ కార్యక్రమం జనవరి 20న ప్రారంభమైంది. జరవరి 24 వరకు కళాఖండాలను చెక్కేందుకు వివిధ దేశాలకు చెందిన జట్లకు సమయం ఇచ్చారు. ఆ తర్వాత జనవరి 29 వరకు స్నో స్క్లప్చర్‌లో సందర్శకులకు అనుమతి ఇస్తున్నారు. ప్రతిభావంతులు మంచుతో అద్భుతమైన కళాఖండాలు సృష్టిస్తున్నారు. భారత్‌ తరఫున మూడు మంచు కళా ఖండాలును తయారు చేశారు. వాటిని రకరకాల థీమ్‌లతో ఏర్పాట చేశారు. పైనున్న ఫొటోలో భారత్‌కు చెందిన శిల్పులు ‘ట్రయంఫ్‌ ఓవర్‌ ఈవిల్‌’ శిల్పాన్ని రూపొందిస్తున్నారు.

International snow sculpture championships

మంగోళియా శిల్పులు 20 టన్నుల మంచుతో స్మార్ట్‌ఫోన్లలో సోషల్‌ మీడియాపై కళాఖండాన్ని చెక్కారు.

International snow sculpture championships

20 టన్నుల మంచుతో ఫ్రాన్స్‌కు చెందిన శిల్పులు నార్మండీ ట్విస్టర్‌ శిల్పాన్ని తయారుచేశారు.

International snow sculpture championships

టర్కీ శిల్పులు మంచుతో పజిల్‌ సర్కిల్‌ను రూపొందించారు.

International snow sculpture championships

చైనాకు చెందిన శిల్పులు మంచుతో కిరీటంతో ఉన్న తలను చెక్కారు.

306 307

 

అంజి గోనె

నా పేరు గోనె. అంజి. న్యూస్‌మీటర్‌ తెలుగులో జర్నలిస్టుగా పని చేస్తున్నాను. గతంలో 99టీవీలో క్షేత్రస్థాయి అధ్యయనం చేశాను. మోజో టీవీలో సంవత్సరం పాటు జర్నలిస్టుగా పనిచేశాను. కలం నా బలం, సమస్యలే నా గళం. జర్నలిజం పట్ల ఇష్టంతో నేను ఈ వృత్తిని ఎంచుకున్నాను.