అదుపుతుప్పుతున్న తాత్కాలిక ఆర్టీసీ డ్రైవర్లు

By న్యూస్‌మీటర్ తెలుగు  Published on  14 Oct 2019 11:57 AM GMT
అదుపుతుప్పుతున్న తాత్కాలిక ఆర్టీసీ డ్రైవర్లు

హైదరాబాద్‌: ఒకరు మందు కొట్టి, మరొకరు అనుభవం లేక ఆర్టీసీ బస్సులు జనాల మీదకు వెళ్లాయి. 11 రోజులుగా వేలాది మంది ఆర్టీసీ కార్మికులు సమ్మె చేస్తున్న సంగతి తెలిసిందే. దీంతో..ప్రభుత్వం, ఆర్టీసీ అధికారులు తాత్కాలిక డ్రైవర్లను నియమించుకుంటున్నారు. అయితే..వారికి సరైన అనుభవం లేకపోవడంతో ప్రజల ప్రాణాల మీదకు వస్తుంది. హయత్ నగర్‌లోని భాగ్యలత జంక్షన్ వద్ద ఓ ఆర్టీసీ బస్సు కారు, బైక్‌ను ఢీ కొట్టింది. తాత్కాలిక బస్సు డ్రైవర్ వినోద్‌ను అదుపులోకి తీసుకున్నారు. డ్రంక్‌ అండ్ కండీషన్ చెక్‌ చేయగా 355 పాయింట్లు రావడంతో పోలీసులు ఒక్కసారిగా అవాక్కయ్యారు.

మరోవైపు..కూకట్‌పల్లిలో ఒక ఆర్టీసీ బస్సును మరో ఆర్టీసీ బస్సు వెనుక నుంచి ఢీ కొట్టింది. బస్సును నిర్లక్ష్యంగా నడిపడంతో ప్రమాదం జరిగింది. ఈ రెండు ఘటనలు ప్రజల్లో భయాందోళనకు రేకెత్తించాయి. ప్రజలు ఆర్టీసీ బస్సులు ఎక్కాలన్నా, రోడ్ల మీదకు రావాలన్నా బెంబేలెత్తిపోతున్నారు.

Next Story