కరీంనగర్‌లో ఇంటర్‌ విద్యార్థిని దారుణ హత్య

By సుభాష్  Published on  10 Feb 2020 4:22 PM GMT
కరీంనగర్‌లో ఇంటర్‌ విద్యార్థిని దారుణ హత్య

కరీంనగర్‌లో రాధిక అనే ఇంటర్‌ విద్యార్థిని దారుణ హత్యకు గురైంది. విద్యానగరంలో సోమవారం ఓ విద్యార్థినిపై గుర్తు తెలియని వ్యక్తి కత్తితో దాడి చేసి దారుణంగా చంపేశాడు. తల్లిదండ్రులు కూలీ పనులకు వెళ్లడంతో విద్యార్థిని ఇంట్లో ఒంటరిగా ఉండగా, గుర్తు తెలియని వ్యక్తి ఇంట్లోకి వచ్చి ఆమెపై కత్తితో దాడికి పాల్పడ్డాడు. దీంతో రక్తపు మడుగులో కొట్టుమిట్టాడుతున్న రాధక మృతి చెందింది.

తల్లి దండ్రులు కూలీ పనులకు వెళ్లి ఇంటికి తిరిగి వచ్చే సరికి శవమై కనిపించడంతో షాక్‌కు గురయ్యారు. ఇక సమాచారం తెలుసుకున్న పోలీసులు ఘటన స్థలానికి వచ్చి పరిశీలించారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. కాగా, రాధిక హత్యకు ప్రేమ వ్యవహారమే కారణమని తెలుస్తోంది. కేసు దర్యాప్తు జరిపిన తర్వాత పూర్తి వివరాలు వెల్లడిస్తాని పోలీసులు చెబుతున్నారు.

Next Story
Share it