గుంటూరు: జిల్లాలోని దుర్గి మండలం, అడిగోప్పుల గ్రామంలో రోడ్డు ప‌్రమాదం జరిగింది. ఆగి ఉన్న లారీని అటు వైపుగా వెళ్తున్న లారీ ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో లారీలో ఉన్న డ్రైవర్‌, క్లీనర్‌కు తీవ్ర గాయాలయ్యాయి. స్థానికులు గమనించి బాధితులను వెంటనే ఆస్పత్రికి తరలించారు. అడిగోప్పులోని ఎర్రవాగు వద్ద ఈ సంఘటన చోటుచేసుకుంది. అయితే ఈ ప్రమాదంపై పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

న్యూస్‌మీటర్ తెలుగు

Next Story