ఇండిగో ఎయిర్ లైన్స్ కీలక నిర్ణయం

By రాణి  Published on  7 March 2020 1:15 PM GMT
ఇండిగో ఎయిర్ లైన్స్ కీలక నిర్ణయం

భారతదేశంలో సైతం కరోనా వైరస్ ప్రబలుతున్న నేపథ్యంలో ఇండిగో ఎయిర్ లైన్స్ సంస్థ కీలక నిర్ణయం తీసుకుంది. కరోనా నేపథ్యంలో ప్రయాణికుల సౌకర్యార్థం ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపింది. మార్చి 31వ తేదీ వరకూ విమానాల క్యాన్సిలేషన్, రీ షెడ్యూలింగ్ ఛార్జీలను రద్దు చేస్తున్నట్లు ప్రకటించింది. మార్చి 12 నుంచి మార్చి 31 వరకూ జాతీయ, అంతర్జాతీయ విమాన సర్వీసులకు టికెట్ బుక్ చేసుకున్నా..రద్దు చేసుకున్నా ఎలాంటి ఛార్జీలను వసూలు చేయబోమని పేర్కొంది. ఆయా తేదీల మధ్య ప్రయాణాల మార్పులకు కూడా ఎలాంటి ఛార్జీలు విధించబోమని వెల్లడించింది ఇండిగో.

కరోనా మహిమతో ఇండియా నుంచి ఇతర దేశాలకు వెళ్లాల్సిన వారు తమ ప్రయాణాలను వాయిదా వేసుకున్నారు. ఇతర దేశాలకు వెళ్తే..అక్కడున్న వైరస్ తమకెక్కడ సోకుతుందోనని భయపడుతున్నారు ప్రయాణికులు. అలాగే ఇటలీ, జపాన్ తదితర దేశాల నుంచి వస్తున్నవారికి కరోనా వైద్య పరీక్షలు నిర్వహిస్తున్నారు. ఇప్పటి వరకూ భారత్ లో కరోనా బాధితుల సంఖ్య 31గా ఉండగా..కరోనా ప్రభావంతో ఎవరూ మరణించలేదు.

Next Story