భారతీయ రైల్వే లు ఇక మరింత వేగంగా పరిగెత్తనున్నాయి. ఇకపై రానున్న రోజుల్లో మనరైల్వేల వనరులు మెరుగవుతాయి. వసతులు పెరుగుతాయి. దాంతో రైళ్లు గంటకి 160 కిమీ వేగంతో పరుగులు తీస్తాయన్న మాట. ముంబాయి, ఢిల్లీ, కోల్ కతా రూట్లో ఈ స్పీడ్ తో రైళ్లు పరుగులు తీస్తాయి. గూడ్స్ రైళ్లు కూడా గంటకు వంద కి.మీ వేగంతో పరుగెత్తుతాయి. దక్షిణాదిలో ఢిల్లీ చెన్నై, ఖరగ్ పూర్ – విజయవాడ  లైన్లలో 130 కిమీ వేగంతో త్వరలో పరుగులు తీస్తాయి. మరో అయిదూ పదేళ్లలో 160 కిమీ వేగాన్ని అలవర్చుకుంటాయి.

మా సామర్థ్యాలు మరింత పెంచుకుని, మా ప్రజాకాంక్షలకు అనుగుణంగా రైళ్లను వేగంగా నడుపుదామని నిర్ణయించుకున్నాం. రానున్న రెండు మూడేళ్లలో క్రిటికల్, సూపర్ క్రిటికల్ స్థాయిలో ఉన్న ప్రాజెక్టులను పూర్తి చేస్తాం – అని చెప్పారు రైల్వే బోర్డు చైర్మన్ వినోద్ కుమార్ యాదవ్. ఆయన ఇటీవల హైదరాబాద్ లో ఫైనాన్షియల్ మేనేజ్ మెంట్ ఇన్ స్టిట్యూట్ ను ప్రారంబించేందుకు వచ్చిన సందర్భంగా ఈ విషయం చెప్పారు. సూపర్ క్రిటికల్ కేటగిరీ లోని 76 శాతం పనులు పూర్తయ్యాయని, మిగతా 26 శాతం పనులు పూర్తి కావడానికి మరో 7500 కోట్లు కావాలని, ఆ తరువాత ఒకటి రెండు సంవత్సరాల్లో ఈ ప్రాజెక్టులు పూర్తవుతాయని ఆయన అన్నారు. క్రిటికల్ కేటగరీలోని ప్రాజెక్టులను పూర్తి చేయడానికి 85000 కోట్లు కావాలి. ఇందులో లేన్ల డబ్లింగ్, ట్రిప్లింగ్, ట్రాఫిక్ సదుపాయాలు ఉన్నాయి. ఇవన్నీ పూర్తయితే రైల్వేల వేగం పెరుగుతుంది. పని తీరు మెరుగుపడుతుంది . రాకపోకలు మరింత సులువవుతాయి. 2021 నాటికి ముంబాయి, కోల్ కతా ఢిల్లీ ల మధ్య ఫ్రైట్ కారిడార్ నిర్మాణం పూర్తవుతుందని ఆయన చెప్పారు.

ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈ విషయంలో అత్యంత చొరవ చూపిస్తున్నారని ఆయన అన్నారు. ముంబాయి, ఉత్తరప్రదేశ్ రాష్ట్రాల ప్రభుత్వాలు కూడా ఈ విషయంలో అనేక ఇబ్బందులను తొలగించాయని ఆయన చెప్పారు.

న్యూస్‌మీటర్ నెట్‌వర్క్

విశ్వసనీయమైన డిజిటల్ మీడియా ప్లాట్‌ఫారమ్.. మీకు విశ్వసనీయ వార్తా కథనాలను మరియు ప్రస్తుత వ్యవహారాల విశ్లేషణను అందిస్తుంది.