తమిళ సూపర్ స్టార్ కి అరుదైన గౌరవం!!
By సత్య ప్రియ Published on 2 Nov 2019 3:24 PM IST
తమిళ సూపర్ స్టార్ రజనీకాంత్ ను భారత అంతర్జాతీయ చలనచిత్రోత్సవం (ఐఎఫ్‌ఎఫ్‌ఐ 2019 ఉత్సవంలో)లో ఐకాన్ ఆఫ్ గోల్డెన్ జూబ్లీ అవార్డుతో సత్కరించనున్నారు.
50వ ఇంటర్నేషనల్ ఫిలిం ఫెస్టివల్ ఆఫ్ ఇండియా (ఐఎఫ్‌ఎఫ్‌ఐ) 2019 అవార్డ్స్‌లో 'ఐకాన్ ఆఫ్ ది గోల్డెన్ జూబ్లీ' అవార్డ్‌తో రజనీకాంత్‌ను సత్కరించనున్నట్లు కేంద్ర సమాచార ప్రసారశాఖ మంత్రి ప్రకాష్ జవదేవకర్ ట్విటర్ ద్వారా శనివారం అధికారికంగా ప్రకటించారు.
50వ ఐఎఫ్‌ఎఫ్‌ఐ అవార్డుల ఉత్సవం గోవాలో నవంబరు 20 నుంచి 28 వరకు జరగనుంది. వివిధ దేశాలకు చెందిన సుమారు 250 సినిమాలను ఈ చలనచిత్రోత్సవంలో ప్రదర్శించనున్నారు. అలాగే విదేశీ నటి కేటగిరీలో ఫ్రెంచ్ నటి ఇసాబెల్లె హప్పెర్ట్ మరో విశేష అవార్డు దక్కింది. లైఫ్ టైమ్ అచీవ్‌మెంట్ అవార్డు ఆమెను వరించింది.
గత కొన్ని దశాబ్దాలుగా భారతీయ సినిమాకు ఆయన చేసిన విశేష కృషికి గుర్తింపుగా ఈ అవార్డును ప్రకటించడం చాలా ఆనందంగా ఉందని తెలిపారు. అలాగే ఇసాబెల్లెకు లైఫ్ టైమ్ అచీవ్‌మెంట్ అవార్డు ప్రకటించడం సంతోషంగా ఉందని ట్వీట్ చేశారు.
దీనిపై స్పందించిన రజనీకాంత్ ప్రతిష్టాత్మక గౌరవానికి తనను ఎంపిక చేసినందుకు భారత ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలుపుతూ ట్వీట్ చేశారు.