సూడాన్‌లో అగ్నిప్రమాదం. మృతులలో భారతీయులు
By Newsmeter.Network Published on 5 Dec 2019 1:34 PM IST
సూడాన్ రాజధాని ఖార్తూమ్‌లో అగ్ని ప్రమాదం చోటుచేసుకుంది. ఓ సిరామిక్ కంపెనీ లో జరిగిన ఈ ఘటనలో 23 మంది మృతి చెందారు. ప్రమాదంలో మరో 130మంది తీవ్రంగా గాయపడ్డారు. మృతుల్లో కొందరు భారతీయులు కూడా ఉన్నట్లు సుడాన్ భారత రాయబార కార్యాలయం వెల్లడించింది. అయితే ఎంతమంది చనిపోయారన్నదానిపై పూర్తిగా స్పష్టత ఇవ్వలేదు. సుడాన్ దేశ రాజధాని ఖార్తూమ్‌లోని ఓ కర్మాగారంలో ఎల్‌పీజీ ట్యాంకర్ పేలడంతో మంగళవారం ఈ ప్రమాదం జరిగింది. ప్రమాదం జరిగిన కర్మాగారంలో సుమారు 50 మంది వరకు భారతీయులు పనిచేస్తున్నట్లు సమాచారం. గాయపడి చికిత్స పొందుతున్నవారిలో ఏడుగురు భారతీయుల పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది. సంఘటనా స్థలంలో అగ్నిప్రమాదాల్ని నివారించేందుకు ఎటువంటి ఏర్పాట్లు లేకపోవడంతో మృతుల సంఖ్య భారీగా పెరిగినట్లు ప్రాథమిక దర్యాప్తులో తేలింది.
Also Read
లోయలో పడిన బస్సు.. 22 మంది మృతిNext Story