ఆ దేశంలో ఇండియన్ షెఫ్స్ కి మాంచి డిమాండ్

By అంజి  Published on  20 Jan 2020 6:58 AM GMT
ఆ దేశంలో ఇండియన్ షెఫ్స్ కి మాంచి డిమాండ్

ముఖ్యాంశాలు

  • చైన్ రెస్టారెంట్లను ప్రారంభించిన ఇండియన్
  • కెనడాలో ఇండియన్ రెస్టారెంట్లకు పాపులారిటీ
  • ఉద్యోగంకోసం కెనడా వెళ్లిన హేమంత్ భగ్ వానీ
  • రెస్టారెంట్ పెట్టి సక్సెస్ సాధించిన హేమంత్
  • కొత్త షెఫ్స్ రిక్రూట్ మెంట్ కోసం ప్రకటన
  • ప్రముఖంగా ఈ వార్తను ప్రచురించిన ఎంబసీ
  • వెల్లువెత్తుతున్న అభ్యర్థుల ప్రతస్పందన

మీరు అద్భుతంగా వంట చేయగలుగుతారా? అయితే మీకు కెనడాలో ఉద్యోగం గ్యారంటీ. అప్లికేషన్ పెట్టుకోవడమే ఆలస్యం. మీరు ఇండియన్ వంటకాల్ని బహు రుచిగా చేయగలుగుతారా? అయితే కెనడా రెస్టారెంట్లు మీకోసం పడి చచ్చిపోతున్నాయి. కెనడియన్ ఇమిగ్రేషన్ ఏజెన్సీ ఈ మధ్యే ఇండియన్ ఛెప్ హేమంత్ భగ్ వానీ మీద ఓ చక్కటి ఆర్టికల్ ని పోస్ట్ చేసింది.

కెనడాలో తను సాధించిన విజయాలను గురించి, ఇండియన్ ఫుడ్ కి పెరుగుతున్న ఆదరణ గురించి, అక్కడివాళ్లు దేశీ రుచుల్ని ఆస్వాదిస్తున్న వైనం గురించి వివరణాత్మకంగా, విశ్లేషణాత్మకంగా పూర్తి వివరాలను ఆ ఆర్టికల్ లో పొందుపరిచింది. కెనడాలో తను ఇరవైకి పైగా రెస్టారెంట్లను ఓపెన్ చేశాడు. డిమాండ్ విపరీతంగా ఉండడంతో త్వరలోనే మరికొన్ని శాఖల్ని తెరిచే ప్రయత్నాల్లో కూడా ఉన్నాడు.

తన రెస్టారెంట్లలో పనిచెయ్యడంకోసం అత్యంత నైపుణ్యం కలిగిన ఇండియన్ చెఫ్స్ చాలా అవసరమని హేమంత్ చెప్పిన వివరాలు, విషయాలు చాలా ఆకర్షణీయంగా ఉన్నాయి. అధికారిక పోర్టల్ లో 2017నుంచీ కెనడాకు వెళ్లినవాళ్ల పూర్తి వివరాలు అందుబాటులో ఉన్నాయి. అందరూ పూర్తిగా సెటిలై, బ్రహ్మాండంగా సంపాదిస్తున్నవాళ్లే.

2026కల్లా మరో 50వేల మందికి పైగా కొత్తగా ఇమ్మిగ్రేషన్ నిబంధనలకు లోబడి కెనడాలో ఉద్యోగాలు సంపాదించుకునే అవకాశాలున్నాయని అధికారిక గణాంకాలు చెబుతున్నాయి. ఈ పరిస్థితుల నేపధ్యంలో నిజంగానే హేమంత్ చెప్పిన వివరాలు, తన సక్సెస్ స్టోరీ, ఆయన అందిస్తున్న అవకాశాలూ పూర్తి స్థాయిలో ఔత్సాహికులైన యువతీయువకులకు మంచి ఉత్సాహాన్నిచ్చేవే అనడంలో ఎలాంటి సందేహం లేదు.

ఉద్యోగం కోసం కెనడాకు వెళ్లి న హేమంత్ మొదట్నుంచీ కచ్చితంగా రెస్టారెంట్ ఓపెన్ చేయాలన్న పట్టుదలతో పనిచేశాడు. తర్వాత్తర్వాత మెల్లగా కుదురుకుని ఓ రెస్టారెంట్ మొదలుపెట్టాడు. చాలా తక్కువకాలంలోనే డిమాండ్ కి అనుగుణంగా శాఖల్ని పెంచుకుంటూపోవాల్సొచ్చింది. ఇవాళ్ల తనక్కడ ఓ పెద్ద బిజినెస్ మాగ్నెట్. కెనడా వెళ్లాలని, అక్కడ స్థిరపడాలని, పీఆర్ తెచ్చుకోవాలని, బాగా డబ్బు సంపాదించాలనీ కలలుగనేవాళ్లకు హేమంత్ ఇస్తున్న ఆఫర్ నిజంగా లాభదాయకమే.

Next Story