రాహుల్ సెంచరీ.. కివీస్‌ ముందు భారీ లక్ష్యం

By Newsmeter.Network  Published on  11 Feb 2020 6:16 AM GMT
రాహుల్ సెంచరీ.. కివీస్‌ ముందు భారీ లక్ష్యం

మౌంట్‌ మాంగనీ వేదికగా జరుగుతున్న మూడో వన్డేలో టీమిండియా భారీ స్కోర్‌ సాధించింది. లోకేష్ రాహుల్ సెంచరీతో (113 బంతుల్లో 112,9 ఫోర్లు, 2 సిక్సర్లు) కదం తొక్కడంతో నిర్ణీత 50 ఓవర్లలో టీమిండియా 7 వికెట్ల నష్టానికి 296 పరుగులు చేసింది.

టాస్‌ ఓడి బ్యాటింగ్‌ దిగిన భారత్‌కు శుభారంభం ద‌క్క‌లేదు. ఓపెన‌ర్ మ‌యాంక్ అగ‌ర్వాల్ (1), కెప్టెన్ విరాట్ కోహ్లీ (9) తక్కువ పరుగులకే పెవిలియన్‌ చేరడంతో 32 ప‌రుగుల‌కే రెండు వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడింది. ఈ ద‌శ‌లో ఓపెనర్‌ పృథ్వీ షా(40; 42బంతుల్లో 3పోర్లు, 2సిక్సర్లు) తో కలిసి శ్రేయ‌స్ అయ్య‌ర్(63 బంతుల్లో 62, 9 ఫోర్లు) జ‌ట్టును ఆదుకునే ప్ర‌య‌త్నం చేశారు. మూడో వికెట్‌కు 30 ప‌రుగులు జోడించారు. అయితే లేని ప‌రుగు కోసం ప్ర‌య‌త్నించి షా ర‌నౌట‌య్యాడు.

షా ఔటయ్యాక క్రీజులోకి వ‌చ్చిన లోకేష్‌ రాహుల్‌.. శ్రేయ‌స్‌తో చ‌క్క‌ని భాగ‌స్వామ్యం నెల‌కొల్పాడు. దూకుడుగా ఆడుతూ.. ఎడా పెడా బౌండరీలు బాదారు. ఐదో వికెట్‌కు స‌రిగ్గా 100 ప‌రుగులు జోడించాక అయ్య‌ర్ వెనుదిరిగాడు. ఈ స్థితిలో మ‌నీశ్‌పాండే(42 బంతుల్లో 40,3 ఫోర్లు, 2 సిక్సర్లు) తో క‌లిసి రాహుల్ భార‌త్‌కు భారీ స్కోరు అందించే బాధ్య‌త‌ను తీసుకున్నాడు. ఈ క్ర‌మంలో ధాటిగా ఆడిన వీరిద్ద‌రూ 91 బంతుల్లోనే 107 ప‌రుగులు జోడించారు. కొద్ది సేపటికే.. రాహుల్ వ‌న్డేల్లో నాలుగో సెంచ‌రీని పూర్తి చేసుకున్నాడు. చివ‌రిలో స్కోరు పెంచే క్ర‌మంలో వీరిద్దరూ ఔట‌వడంతో టీమిండియా 300 పరుగుల మార్కును చేరలేకపోయింది.

Next Story