సిరీస్‌ సాధించారు.. వైస్ కెప్టెన్‌.. కెప్టెన్ రాణించి..

By న్యూస్‌మీటర్ తెలుగు  Published on  19 Jan 2020 4:02 PM GMT
సిరీస్‌ సాధించారు.. వైస్ కెప్టెన్‌.. కెప్టెన్ రాణించి..

భారత్-ఆసీస్‌ జ‌ట్ల మ‌ధ్య‌ బెంగళూరు చిన్నస్వామి స్టేడియం వేదికగా జరుగుతున్న చివ‌రిదైన పైన‌ల్ కాని ఫైన‌ల్ వన్డేలో టీమిండియా విక్ట‌రీ మోగించింది. ఫామ్‌లో ఉన్న ఓపెన‌ర్ ధవన్ గాయం కార‌ణంగా ఆటకు దూరమవడంతో.. మ‌రో ఓపెన‌ర్ రోహిత్ శ‌ర్మ సూప‌ర్ సెంచ‌రీ(119)తో అభిమానుల‌ను కనువిందు చేశాడు.

రోహిత్‌తోపాటు కెప్టెన్ విరాట్ కోహ్లీ 89 పరుగులతో చేసి టీమిండియా విజయానికి బాటలు వేశారు. వీరిద్దరూ కలిసి 137 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పారు. అంత‌కుముందు టాస్ గెలిచిన‌ ఆసీస్.. భార‌త్ ముందు 286 పరుగుల లక్ష్యాన్ని ఉంచారు. అనంత‌రం ల‌క్ష్య ఛేద‌న‌కు దిగిన‌ భారత్ మూడు వికెట్లు కోల్పోయి 47.3 ఓవ‌ర్ల‌లో 289 ప‌రుగులతో ల‌క్ష్యాన్ని ఛేదించింది. చివ‌ర‌గా కోహ్లీ అవుటవడంతో క్రీజులోకి వచ్చిన మనీశ్ పాండే ఫోర్‌తో మ్యాచ్‌ను ముగించాడు. దీంతో కొత్త ఏడాది టీమిండియా వ‌రుస‌గా రెండో టైటిల్‌ను ముద్దాడింది.

Next Story