భువనేశ్వర్ : భారత పురుషులు, మహిళల హాకీ జట్ల కష్టానికి అదృష్టం కలిసి వచ్చిందని చెప్పుకోవాలి. ఒలింపిక్స్ బెర్త్ సాధించడానికి రెండు జట్లు ఒక్క అడుగు దూరంలో మాత్రమే ఉన్నాయి. ఒలింపిక్ క్వాలిఫయిర్స్ మ్యాచ్‌లో రష్యాపై పురుషుల హాకీ జట్టు 4-2 తేడాతో విజయం సాధించింది. ఫస్ట్ 5 నిమిషాల్లో నే హర్మన్ ప్రీత్ గోల్ కొట్టేశాడు. 20వ నిమిషంలో మన్ దీప్ గోల్ కొట్టాడు. ఇక రెండో అర్ధభాగంలో సునిల్, మన్ ప్రీత్ చెరో గోల్ కొట్టడంతో 4-1 తో భారత్ పూర్తి ఆధిక్యంలోకి వెళ్లి పోయింది. చివరిలో రష్యా ఆటగాడు గోల్ కొట్టి భారత్ ఆధిక్యతను 4-2కు తగ్గించాడు.

మహిళా క్వాలిఫయిర్స్ మ్యాచ్‌లో అమెరికాను భారత్ 5-1 తేడాతో మట్టి కరిపించింది. తొలి అర్ధభాగంలో భారత్ 1-0 ఆధిక్యంలో నిలిచింది.రెండో అర్ధబాగంలో రాణి సేన దడదడ లాడించింది .11 నిమిషాల్లోనే నాలుగు గోల్స్ కొట్టింది.రేపు జరిగే మ్యాచ్‌ల్లో ప్రత్యర్ధులను ఓడించినా..మ్యాచ్‌ను డ్రాగా ముగిసినా భారత్ ఒలింపిక్స్‌కు అర్హత సాధించింది

న్యూస్‌మీటర్ తెలుగు

విశ్వసనీయమైన డిజిటల్ మీడియా ప్లాట్‌ఫారమ్ మీకు విశ్వసనీయ వార్తా కథనాలను మరియు ప్రస్తుత వ్యవహారాల విశ్లేషణను తెస్తుంది.