కరోనా వైరస్‌ ప్రపంచాన్నే గడగడలాడిస్తోంది. చైనాలో పుట్టిన ఈ వైరస్‌ ఇతర దేశాలు, రాష్ట్రాలకు పాకుతోంది. ఈ మహమ్మారి ఇప్పుడు భారత్‌లో ప్రవేశించింది. తాజాగా మలేషియాలో కరోనా వైరస్‌ సోకి భారత యువకుడు మృతి చెందినట్లు తెలుస్తోంది. త్రిపుర రాష్ట్రానికి చెందిన మునీర్‌ హుస్సేన్‌ (23) కరోనాతో మృతి చెందాడు. దీంతో మలేషియా అధికారులు మునీర్‌ హుస్సేన్‌ కుటుంబ సభ్యులకు సమాచారం ఇచ్చినట్లు తెలుస్తోంది. కాగా, మృతదేహాన్ని స్వదేశానికి తరలించాలని కుటుంబీకులు అధికారులను కోరుతున్నారు. అయితే యువకుడు అక్కడ విద్యనభ్యసిస్తూ ఓ రెస్టారెంట్‌లో పని చేస్తున్నట్లు తెలుస్తోంది. కరోనా సోకడంతో చికిత్స నిమిత్తం ఆస్పత్రిలో చేరాడు. చికిత్స పొందుతూ మృతి చెందినట్లు తెలుస్తోంది.

అంతే కాకుండా కేరళకు చెందిన ఓ విద్యార్థినికి కరోనా వైరస్‌ సోకినట్లు వైద్యులు నిర్ధారించారు. చైనాలో చదువుకుంటున్నవిద్యార్థికి వైద్య పరీక్షలు చేయడంతో కరోనా సోకినట్లు వైద్యులు తెలిపారు. అతన్ని అబ్జర్వేషన్‌లో ఉంచి పరీక్షిస్తుట్లు వైద్యులు పేర్కొన్నారు.

సుభాష్ గౌడ్

నేను న్యూస్ మీటర్‌లో జర్నలిస్టుగా పని చేస్తున్నాను. గతంలో రిపోర్టర్‌గా, కంటెంట్ రైటర్‌, సబ్ ఎడిటర్‌గా భారత్‌ టుడే న్యూస్‌ ఛానల్‌, సూర్య, ఆంధ్రప్రభ, న్యూస్‌హబ్‌, ఏపీ హెరాల్డ్‌లలో పని చేశాను. జర్నలిజం పట్ల ఇష్టంతో నేను ఈ మార్గాన్ని ఎంచుకున్నాను.