ఆదాయం రూ.7000.. ఆదాయ పన్ను రూ.3 కోట్లు

By Newsmeter.Network  Published on  17 Jan 2020 3:02 AM GMT
ఆదాయం రూ.7000.. ఆదాయ పన్ను రూ.3 కోట్లు

ప్రతి ఉద్యోగి ఆదాయపు పన్ను కట్టాల్సిందే. అయితే అది వారి ఆదాయం పై ఆధారపడి ఉంటుంది అని తెలుసు మనకి. అయితే పంజాబ్ లో ఒక విచిత్రం జరిగింది. కాల్ సెంటర్ లో పనిచేసే ఓ వ్యక్తికి ఐటి శాఖ దాదాపుగా మూడున్నర్ర కోట్ల రూపాయలు కట్టాలని నోటీసులు జారీచేయడంతో అతడు ద్రిగ్భ్రాంతికి గురయ్యాడు. ఏమి చెయ్యాలో తెలియక ఆఫీసులచుట్టూ తిరుగుతున్నాడు.

మధ్యప్రదేశ్ కు చెందిన రవి గుప్తా అనే వ్యక్తి పంజాబ్ లో ఓ కాల్ సెంటర్ లో ఉద్యోగం చేస్తున్నాడు. అతడికి కొన్నిరోజుల క్రితం ఆదాయపన్ను విభాగం నుంచి నోటీసులు వచ్చాయి. 2011-12 ఏడాదికి గాను పాన్ నెంబర్ పై రూ.1.32 కోట్ల మేర ఆర్థిక లావాదేవీలు జరిపారని, అందుకు రూ.3.49 కోట్లు జరిమానా చెల్లించాలన్నది ఆ నోటీసుల సారాంశం.

ఆ నోటీసులు చూసి లబోదిబోమన్న బాధితుడు తన పాన్ నెంబర్ ఆధారంగా ఇతరులు లావాదేవీలు జరిపినట్టు గుర్తించాడు. చాలా ఆఫీసులు తిరిగి చివరికి ముంబయిలోని ఓ వజ్రాల సంస్థ తన పాన్ నెంబర్ ను అక్రమంగా ఉపయోగించుకుందని తెలుసుకున్నాడు. కొన్ని లావాదేవీలు జరిపి ఆపై ఖాతా తొలగించారని, అసలు వాళ్లెవరో తనకు తెలియదని రవి గుప్తా మొత్తుకుంటున్నాడు. అసలు 2011-12 సమయానికి తాను ఒక చిన్న ఉద్యోగంలో ఉన్నానని, అప్పుడు తనకి నెలకు ఆదాయం 7000 రూపాయలు అని చెబుతున్నాడు. కానీ ఇప్పుడు తను పెనాల్టీ చెల్లించకపోతే ఐటీ శాఖ వారు తన ఇంటిని జప్తు చేస్తారని వాపోతున్నాడు.

Next Story