అమరావతి: ఏపీ ఇన్‌ఛార్జి సీఎస్‌గా నీరబ్‌కుమార్‌ ప్రసాద్‌ బాధ్యతలు స్వీకరించారు. ఈ మేరకు ఏపీ ప్రభుత్వ మాజీ ప్రధాన కార్యదర్శి ఎల్వీ సుబ్రమణ్యం ఆయనకు సచివాలయంలో బాధ్యతలు అప్పగించారు. సార్వత్రిక ఎన్నికల సందర్భంగా ఎన్నికల కమిషన్‌ ఉత్తర్వుల మేరకు ఎల్వీ సుబ్రమణ్యం నియమితుడై.. ఆ తర్వాత అధికారంలోకి వచ్చిన కొత్త ప్రభుత్వం కూడా కొనసాగించిన విషయం తెలిసిందే.

అంతర్గతంగా ఏం జరిగిందోగాని ముఖ్యమంత్రి జగన్‌మోహన్‌రెడ్డి ఆయనను మానవ వనరుల అభివృద్ధి కేంద్రం డీజీగా బదిలీ చేస్తూ సోమవారం రాత్రి ఉత్తర్వులు జారీ చేశారు. సీఎస్‌ సుబ్రహ్మణ్యం బదిలీ రాష్ట్ర పరిపాలనా యంత్రాంగంలో సంచలనం రేపింది. కొత్త సీఎస్‌ను నియమించే వరకు ప్రభుత్వం నీరబ్‌కుమార్‌ ఇన్‌చార్జి బాధ్యతలు అప్పగించడంతో ఆయన ఈరోజు విధుల్లో చేరారు.

న్యూస్‌మీటర్ తెలుగు

విశ్వసనీయమైన డిజిటల్ మీడియా ప్లాట్‌ఫారమ్ మీకు విశ్వసనీయ వార్తా కథనాలను మరియు ప్రస్తుత వ్యవహారాల విశ్లేషణను తెస్తుంది.