దిశపై ఫేసుబుక్‌లో అసభ్య ప్రచారం.. యువకుడు అరెస్ట్‌..!

By అంజి  Published on  3 Dec 2019 10:55 AM GMT
దిశపై ఫేసుబుక్‌లో అసభ్య ప్రచారం.. యువకుడు అరెస్ట్‌..!

హైదరాబాద్‌: దిశ ఘటనతో మహిళలు, ప్రజాసంఘాలు దేశ వ్యాప్తంగా ఆందోళనలు నిర్వహిస్తున్నారు. నిందితులను కఠినంగా శిక్షించాలని డిమాండ్‌ చేస్తున్నారు. కాగా దేశ వ్యాప్తంగా సంచలనం సృష్టిస్తున్న వెటర్నరీ డాక్టర్‌ దిశ హత్య ఘటనపై అనుచిత వ్యాఖ్యలు చేసిన యువకుడిని పోలీసులు అరెస్ట్‌ చేశారు. నిజామాబాద్‌ నవీపేట మండలం ఫకీరాబాద్‌కు చెందిన శ్రీరామ్‌ను సైబర్‌ క్రైమ్‌ పోలీసులు అరెస్ట్‌ చేశారు. సోషల్‌ మీడియాలో దిశపై అసభ్యకర కామెంట్లు చేసిన శ్రీరామ్‌ గ్యాంగ్‌పై సీసీఎస్‌ పోలీసులు సుమోటోగా కేసు స్వీకరించారు. దిశ ఘటనపై కొందరు యువకులు ఫేసుబుక్‌ వేదికగా అసభ్యకర కామెంట్లు చేశారు.

దిశ ఘటనపై సోషల్‌ మీడియాలో అనుచిత వ్యాఖ్యలు చేసిన వ్యక్తిని అరెస్ట్‌ చేశామని డీసీపీ అవినాష్‌ మహంతి తెలిపారు. నిందితులను సమర్థిస్తూ, యువతను రెచ్చగొట్టే విధంగా పోస్టులు చేశారని తెలిపారు. నిందితుడిపై వయోలేషన్‌, ఐపీసీ యాక్ట్‌ కింది కేసులు నమోదు చేశామన్నారు. ఈ తరహా పోస్టులు చేసిన వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని డీసీపీ అవినాష్‌ మహంతి తెలిపారు. దిశ ఘటనపై ఎవరైనా అసభ్యకర పోస్టులు పెడితే కఠిన చర్యలు తీసుకుంటామని పోలీసులు పేర్కొన్నారు. దిశ ఫొటోను ఎక్కడ కూడా వాడరాదని.. సోషల్‌ మీడియాపై పూర్తి స్థాయిలో నిఘా ఉంచామని పోలీసులు ఉన్నతాధికారులు తెలిపారు.

Next Story
Share it